ఆ ఒక్క ముచ్చట తీర్చేయండి జగన్ గారు!

ప్రెస్ మీట్లు పెట్టడంలేదు.. అంతా వెయిటింగ్.. ఏదైనా చెప్పాలంటే నేరుగా ప్రజలకే చెబుతున్నారు. ఏదైనా చేయాలంటే నేరుగా ప్రజల కోసం చేస్తున్నారు. తను చెప్పాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు మధ్యలో మీడియా ఒకటి ఉందనే విషయాన్ని జగన్…

ప్రెస్ మీట్లు పెట్టడంలేదు.. అంతా వెయిటింగ్.. ఏదైనా చెప్పాలంటే నేరుగా ప్రజలకే చెబుతున్నారు. ఏదైనా చేయాలంటే నేరుగా ప్రజల కోసం చేస్తున్నారు. తను చెప్పాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు మధ్యలో మీడియా ఒకటి ఉందనే విషయాన్ని జగన్ ఆయాచితంగానే మరిచిపోతున్నారు. తనకంటూ ఓ మీడియా ఉన్నప్పటికీ జగన్ ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపడంలేదు. దానికి ఒకే ఒక్క ఉదాహరణ. ఏపీలో పదవిలోకి వచ్చి 4 నెలలైనా ఇప్పటివరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం.

జగన్-చంద్రబాబు మధ్య పోలికలు తీస్తే ఇది టాప్-5లో ఒకటిగా నిలుస్తుంది. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలనను ఒకసారి గుర్తుచేసుకుందాం. పరిపాలన తక్కువ, ప్రెస్ మీట్లు ఎక్కువ అన్నట్టు ఉండేది అప్పటి పరిస్థితి. ఇక బాబు ఢిల్లీ వెళ్తే ఆ ప్రహసనం ఊహాతీతం. ఢిల్లీ వెళ్లే ముందురోజు ప్రెస్ మీట్. ఢిల్లీ వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్. వచ్చిన తర్వాత ప్రెస్ మీట్. మధ్యలో సెట్ అయితే ఇంకో ప్రెస్ మీట్. ఇలా మీడియా సమావేశాలతోనే కాలం గడిపేశారు బాబు. ఈ క్రమంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాచేశారు. ఈ వృధాను జగన్ అరికట్టారనే చెప్పాలి.

కానీ పూర్తిగా మీడియాను పక్కనపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికార పక్షం బిజీగా ఉండడం కామన్. అదే టైమ్ లో ప్రతిపక్షం కొన్ని పుకార్లు పుట్టించడం సహజం. ప్రజలు అవే పుకార్లను నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే అలాంటి కొన్ని పుకార్లు చలామణిలోకి వచ్చేశాయి. కొన్ని అబద్ధాలని తేలిపోయాయి. మరికొన్ని మాత్రం నిజాలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇలాంటి వాటిపై స్పష్టత ఇవ్వాలంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రభుత్వ విధానాన్ని మీడియాకు ఓసారి వివరిస్తే, పుకార్లు వాటికవే ఆటోమేటిగ్గా తగ్గిపోతాయి.

సీఎం జగన్ మాత్రం మీడియాపై సీతకన్ను వేశారన్నది వాస్తవం. దీనికి కారణాలు అన్వేషిస్తే చాలానే కనిపిస్తాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై ఇదే మీడియా ఎన్ని అవాకులు చవాకులు వాగిందో అందరం చూశాం. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు పుట్టించి ఎన్నో అసత్యాల్ని ప్రసారం చేసింది. దీంతో తన పాదయాత్రలో ఎల్లో మీడియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రారంభించారు జగన్. ఇలా మీడియా వేధింపులకు గురైన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మీడియాను పక్కనపెట్టడంలో ఏమాత్రం తప్పులేదనిపిస్తుంది.

మీడియాపై జగన్ కు మంచి అభిప్రాయం లేదనే అనుకుందాం. అది అతని వ్యక్తిగత అభిప్రాయం కింద లెక్క. కానీ ఇప్పుడు జగన్ కేవలం ఓ వ్యక్తికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మంచైనా, చెడైనా అందర్నీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడప్పుడు మీడియా సమావేశాలు కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మొదటి టర్మ్ ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలానే వ్యవహరించారు. కానీ స్పష్టత ఇవ్వాల్సిన చోట మీడియా సమావేశం పెట్టి మరీ అందర్నీ కడిగిపారేశారు. సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే జగన్ కూడా అనుసరిస్తే బాగుంటుందనేది ఎక్కువమంది అభిప్రాయం. 

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!