జ‌నవరి నుంచి పవన్ కొత్త సినిమా

ఎప్పటి నుంచో వార్తల్లో నలుగుతున్న సినిమా ఒకటి వుంది. పవన్ కళ్యాణ్ చేయబోయే రీమేక్. వినోదయసితం సినిమాను తెలుగులో సముద్రఖని డైరక్షన్ లో పవన్ చేయబోతున్నారు.  Advertisement సాయి ధరమ్ తేజ్ హీరో. ఇందులో…

ఎప్పటి నుంచో వార్తల్లో నలుగుతున్న సినిమా ఒకటి వుంది. పవన్ కళ్యాణ్ చేయబోయే రీమేక్. వినోదయసితం సినిమాను తెలుగులో సముద్రఖని డైరక్షన్ లో పవన్ చేయబోతున్నారు. 

సాయి ధరమ్ తేజ్ హీరో. ఇందులో పవన్ ను మరీ పెద్ద రోల్ కాదు. అందుకే త్వరగా అయిపోతుందనే భావనతో ఓకె చేసారు. దీనికి స్క్రిప్ట్ కరెక్షన్లు, డైలాగులు త్రివిక్రమ్ సూపర్ విజ‌న్ లో బుర్రా సాయి మాధవ్ నే తయారు చేసారు. కానీ ఎప్పుడు సెట్ కు వెళ్తుందో తెలియకుండా వుంది ఇన్నాళ్లూ.

ఇప్పుడు దీనికి మోక్షం వచ్చింది. జ‌నవరి నుంచి ఈ సినిమాను పవన్ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాకు కాస్త పాజ్ ఇచ్చి వినోదయసితం సినిమా మీదకు వస్తున్నారు. పీపుల్స్ మీడియా పతాకంపై విశ్వప్రసాద్ నిర్మించబోతున్నారు.

నిన్నటికి నిన్న దర్శకుడు త్రివిక్రమ్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఈ వైనం అంతా ఫైనల్ చేసుకుని వచ్చారు. ఇదిలా వుంటే ఈ మధ్య హరీష్ శంకర్ తో తెరి రీమేక్ చేస్తారని తెలిసి పవన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఓ రోజంతా రీమేక్ వద్దు బాబోయ్ అని ట్రెండ్ చేసారు. ఇప్పుడు ఈ రెండో రీమేక్ బయటకు తీసారని తెలిస్తే ఎలా ఫీలవుతారో? ఏం ట్రెండ్ చేస్తారో?