అమరావతి రాజధాని ఇపుడు ఏపీలో హాట్ హాట్ టాపిక్ అన్న సంగతి తెలిసిందే. అమరావతి సహా మూడు రాజధానులు చేస్తామని వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం దానికి గవర్నర్ రాజముద్ర పడడమూ జరిగిపోయాయి.
ఇపుడు ఈ కేసు కోర్టులో ఉంది. మరో వైపు రాజకీయంగా కూడా టీడీపీ వైసీపీ మాటలయుధ్ధం సాగుతోంది. అమరావతిని రాజధానిగా అలాగే ఉంచేయండి నాతో సహా ఆ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేస్తామని ఓ వైపు చంద్రబాబు విన్నపాలు చేసుకుంటున్నారు.
అంటే అమరావతిని ఇక ఏ మాత్రం ఆపలేమని అధినేత బాబుకు బాగా బోధపడిన తరువాతనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఓ విధంగా తమ్ముళ్ళూ నీరసం మాటలే మాట్లాడుతున్నారు.
కానీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం అమరావతి అక్కడే ఉంటుంది అంగుళం కూడా కదలదు అంటున్నారు. అమరావతిని కదిపే సాహసం ఎవరూ చేయలేరని ఆమె కడు ధీమాగా చెబుతున్నారు.
నిజంగా అనిత లాంటి వారి ధైర్యం, నమ్మకం అధినాయకత్వంలో ఎంతో కొంత ఉన్నా ఈ పాటికి దూకుడు నిర్ణయాలకు టీడీపీ సై అనేదన్న విశ్లేషణలూ ఉన్నాయి. చేతిలో ఆయుధం ఉంచుకుని జగన్ మీద భారం వేస్తున్న టీడీపీ పెద్దలు ఓ వైపు ఉంటే అనితమ్మ మాత్రం అమరావతి మీద నిబ్బరంగానే మాట్లాడుతూండడం విశేషమే. ఏది ఏమైనా ఆ నమ్మకం, ధైర్యం కొంతైనా బాబు తెచ్చుకుంటే ఏపీలో టీడీపీలో పొలిటికల్ సీన్ మరోలా ఉండేదని కామెంట్స్ పడుతున్నాయి.