చరిత్రాత్మకం: రైతులకు జగన్ భరోసా

రైతులకు రుణాలు చూశాం. ఆ రుణాలపై వడ్డీలు కూడా చూశాం. కేంద్రం ఇచ్చిన గ్రాంట్ కు మరో కొత్త పేరు తగిలించి, కొత్త పథకం అంటూ కలరింగ్ ఇచ్చిన ప్రభుత్వాల్ని కూడా చూశాం. ఇక…

రైతులకు రుణాలు చూశాం. ఆ రుణాలపై వడ్డీలు కూడా చూశాం. కేంద్రం ఇచ్చిన గ్రాంట్ కు మరో కొత్త పేరు తగిలించి, కొత్త పథకం అంటూ కలరింగ్ ఇచ్చిన ప్రభుత్వాల్ని కూడా చూశాం. ఇక కౌలు రైతుల సంగతి సరేసరి. ఇలాంటి ఎన్నో రాజకీయాలు, మరెన్నో మతలబులు చూసిన కళ్లతో ఇప్పుడు ఓ చరిత్రను చూశాం. అదే వైఎస్ఆర్ రైతు భరోసా.

జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో అత్యంత కీలకమైనది, ముఖ్యమైనది, తొలి ప్రాధాన్యత కలిగిన ఈ పథకం ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. అన్నదాతల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా ఏడాదికి 13వేల 500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తూ, ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన ఈ నూతన పథకం చూసి రైతులోకం పులకించిపోతోంది. మరీ ముఖ్యంగా కౌలు రైతుల ఆనందం మాటల్లో చెప్పలేనిది.

అవును.. రైతుల కోసం ఎన్నో పథకాలు వచ్చాయి, పోయాయి. కానీ కౌలు రైతుల్ని పట్టించుకున్న ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు. తన పాదయాత్రలో జగన్ కళ్లారా చూసిన వాస్తవిక బాధాకరమైన ఘటనల్లో చాలామటుకు కౌలు రైతులకు సంబంధించినవే. “నేను విన్నాను, నేను ఉన్నానంటూ”.. అప్పట్లోనే కౌలు రైతులకు భరోసా ఇచ్చారు జగన్. చెప్పినట్టుగానే కౌలు రైతులకు కూడా వైఎస్ఆర్ భరోసాను అందించారు.

రైతులకు ఆర్థిక సాయం అందించే ఇంత పెద్ద కార్యక్రమం దేశంలో మరే రాష్ట్రంలో లేదు. మరీ ముఖ్యంగా కౌలు రైతుల్ని ఆదుకున్న దాఖలాలు అస్సలుకే లేవు. జగన్ రాకతోనే అది సాధ్యమైంది. అసాధ్యం అనుకున్న కార్యక్రమం కళ్లముందు ఆవిష్కృతమైంది. ఇక్కడే మరో ట్విస్ట్. జగన్ ప్రకటించింది 12వేల 500 మాత్రమే. కానీ మరో వెయ్యి పెంచి 13వేల 500 రూపాయల్ని ఆర్థిక సాయంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు ముఖ్యమంత్రి.

తను ఏం చేసినా రైతుల సంక్షేమం కోసమే అని నిరూపించుకున్నారు. అంతేకాదు.. ఇక్కడ కూడా ఎలాంటి మాయమాటలు, కప్పిపుచ్చడాలు పెట్టుకోలేదు సీఎం. తను ప్రకటించిన కార్యక్రమానికి పీఎం కిసాన్ పథకం అనే పదాన్ని కూడా జోడించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇందులో ఉన్నాయని భారీ బహిరంగ సభలో బాహాటంగా ప్రకటించారు. నిజానికి ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించింది చాలా తక్కువ. జగన్ కేటాయించిన నిధులే చాలా ఎక్కువ.

పీఎం కిసాన్ అనే పదాన్ని జోడించకపోయినా అడిగేవారు లేరు. కాకపోతే విమర్శలకు తావివ్వకూడదనే జగన్ ఉద్దేశం, పారదర్శకంగా ఉండాలనే అతని ఆశయం ఈ పథకంలో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు.. మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే.. 2020లో ఈ పథకం అమలుకావాలి. కానీ రైతుల వెతల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది నుంచే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. పథకం కింద జూన్ నెలలో ఇప్పటికే 2వేల రూపాయలు అందించారు. మరో 9వేల 500 రూపాయల్ని ఈ నెలలో జమచేస్తారు.

మరో 2వేల రూపాయల్ని సంక్రాంతికి అందించబోతున్నారు. అంతేకాదు.. ఇక్కడ కూడా జగన్ మరో ఔదార్యాన్ని చూపించారు. ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు రైతులు. ఇలాంటి టైమ్ లో ఈ మొత్తాల్ని వాళ్ల ఖాతాల్లో వేస్తే, బ్యాంకులు వాటిని పాత అప్పుల కింద జమ చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే బ్యాంకర్లతో మాట్లాడి, పాత అప్పులతో సంబంధం లేకుండా ఈ కొత్త మొత్తాల్ని రైతుల చేతులకు అందేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు జగన్. ఓవైపు చెరువుల నిండా వానలు, మరోవైపు చేతిలో ఆర్థిక సాయం. ఓ రైతుకు ఇంతకంటే ఇంకేం కావాలి. అందుకే జగన్ ను రైతులంతా మనసారా దీవిస్తున్నారు. 

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన