మనోజ్..పవన్..భేటీ వెనుక?

మంచు మోహన్ బాబు రూటే సెపరేటు..ఇప్పుడు ఆయన కుమారుడు మంచు మనోజ్ రూటు కూడా సెపరేట్ గానే వుంది. మెగా క్యాంప్ తో మోహన్ బాబు, విష్ణు టగ్ ఆఫ్ వార్ ఆడుతుంటూ, మనోజ్…

మంచు మోహన్ బాబు రూటే సెపరేటు..ఇప్పుడు ఆయన కుమారుడు మంచు మనోజ్ రూటు కూడా సెపరేట్ గానే వుంది. మెగా క్యాంప్ తో మోహన్ బాబు, విష్ణు టగ్ ఆఫ్ వార్ ఆడుతుంటూ, మనోజ్ వెళ్లి పవన్ కళ్యాణ్ తో ముచ్చట్లు పెట్టడం భలే చిత్రంగా వుంది. 

గతం కొంత కాలంగా మనోజ్ తన దోవన తాను పయనిస్తున్నారు. కొద్ది రోజులు కుటుంబానికి దూరంగా వున్నారని, మళ్లీ ఇప్పుడిప్పుడే దగ్గరయ్యారని కూడా గ్యాసిప్ లు వున్నాయి. ఒక సినిమా చేతిలో వుంది కానీ అది ఆగిపోయి వుంది.

హైదరాబాద్, చెన్నయ్, ఇలా పలు చొట్ల వుంటూ వస్తున్నారు. టూరిజం స్కీమ్ ఒకటి ప్లాన్ చేసి, దానికి స్థలం, అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలిసి వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసి గంట సేపు ముచ్చటించారు.

భూమా నాగిరెడ్డి కుటుంబం జనసేనలో చేరుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. భూమా కుటుంబంతో మనోజ్ కు మంచి సన్నిహిత స్నేహ సంబంధాలు వున్నాయి. ఆ కుటుంబం జనసేనలో చేరుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మనోజ్ వెళ్లి పవన్ తో భేటీ వేయడం ఆసక్తికరంగా వుంది.