కరెంట్ గురించి బాబే మాట్లాడాలి…

చంద్రబాబుకు ఇపుడు మరో మంచి సబ్జెక్ట్ దొరికింది, అదేంటి అంటే ఏపీలో విద్యుత్ కోతలు, కష్టాలు అంటూ బాగానే ఊదరగొడుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. అవును కరెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సిన వస్తే బాబే…

చంద్రబాబుకు ఇపుడు మరో మంచి సబ్జెక్ట్ దొరికింది, అదేంటి అంటే ఏపీలో విద్యుత్ కోతలు, కష్టాలు అంటూ బాగానే ఊదరగొడుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. అవును కరెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సిన వస్తే బాబే మాట్లాడాలి మరి అంటూ సెటైర్లు కూడా వేశారు.

ఏకంగా 8500 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు బాబు పెడితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత  వాటిని తీర్చిందని ఆయన గుర్తు చేశారు. దేశమంతా బొగ్గు నిల్వల కొరతతో కరెంట్ సమస్యలు వస్తే అది కూడా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఇక లిక్కర్ ధరలు పెడితే టీడీపీ నేతలు గుండెలు బాదుకోవడం దేనికి అంటూ కన్నబాబు ప్రశ్నించారు. అవేమైనా నిత్యావసరాలా అంటూ వెటకారం ఆడారు. మందు బాబులకు వకాల్తా పుచ్చుకున్న పార్టీ టీడీపీ అంటూ కౌంటర్లేశారు. ఇక ఏపీని మోసం చేసిన ఇద్దరు నాయకులు ఎవరూ అంటే వారు చంద్రబాబు, యనమల రామక్రిష్ణుడు అని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఆర్ధిక శాఖను నాడు యనమల సక్రమంగా నిర్వహిస్తే ఈనాడు అప్పుల బాధ తప్పేది కదా అంటూ నిలదీశారు.

మీరు అప్పులు వేల కోట్లు తేలేదా అంటూ ప్రశ్నించారు. మీరు తెచ్చిన అప్పులు ఏం చేశారో లెక్క చెప్పగలరా అంటూ కన్నబాబు సూటిగానే బాణాలు వేశారు. తాము తెచ్చిన ప్రతీ పైసా పేదావాడి గుడిసెకు చేరుస్తున్నామని, అవినీతికి తావు లేని పాలన అందిస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో ప్రజలు పండుగ చేసుకుంటూంటే టీడీపీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని కూడా ఆయన ఆగ్రహించారు.