అది స్టయిల్ కాదు.. నమ్మకం

ఈమధ్య మెడలో వేసుకోవాల్సిన రుద్రాక్ష మాలను చేతికి కట్టుకొని తిరుగుతున్నాడు అఖిల్. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో చేతికి రుద్రాక్ష మాల లాంటి దండను చుట్టుకొని కనిపిస్తున్నాడు. చూసినవాళ్లంతా దీన్నొక లేటెస్ట్ ఫ్యాషన్…

ఈమధ్య మెడలో వేసుకోవాల్సిన రుద్రాక్ష మాలను చేతికి కట్టుకొని తిరుగుతున్నాడు అఖిల్. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో చేతికి రుద్రాక్ష మాల లాంటి దండను చుట్టుకొని కనిపిస్తున్నాడు. చూసినవాళ్లంతా దీన్నొక లేటెస్ట్ ఫ్యాషన్ అనుకున్నారు. కొత్తరకం ట్రెండ్ అని భావించారు. కానీ ఆఖిల్ మాత్రం అది స్టయిల్ కాదంటున్నాడు.

“ఇది స్టయిల్ కాదు. ఓ నమ్మకం. ఈ స్టోన్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని ఫీలింగ్. నేను ఇలాంటివి నమ్ముతాను. ఓ ఫ్రెండ్ చెప్పారు నాకు. అందుకే నేను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. నాకు ఇది చెప్పింది ఓ మంచి ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ మాత్రం కాదు.”

ఇలా తన చేతికి కట్టుకున్న మాల వెనక మేటర్ బయటపెట్టాడు అఖిల్. ఈ హీరో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్నాడు అఖిల్. ఓ ఇంటర్వ్యూలో ఫ్యాషన్ పై తన మనసులో మాట బయటపెట్టాడు.

“బాగా పాపులర్ అయిన ఫ్యాషన్స్ నేను కూడా ఫాలో అవుతాను. కానీ ఫ్యాషన్ కంటే ముందుగా కంఫర్ట్ చూసుకుంటాను. రొటీన్ లైఫ్ లో మనం ఎంత కంఫర్ట్ గా ఉంటే అంత ఫ్యాషనబుల్ గా కూడా కనిపిస్తాం. అదే సీక్రెట్. ఇక సినిమాల్లో ట్రెండీ డ్రెస్సులు వేయడం కామన్. అదంతా సినిమా వరకే. రెగ్యులర్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఉండడానికే ఇష్టపడతాను.”

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హర్ష అనే పాత్ర పోషించాడు అఖిల్. సినిమాలో ఆ పాత్రకు, నిజజీవితంలో తన లైఫ్ కు అస్సలు సంబంధం ఉండదంటున్నారు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరవుతానంటున్నాడు ఈ అక్కినేని హీరో.