మింగలేక.. కక్కలేక.. బాలకృష్ణ

బాలయ్య ఏం మాట్లాడినా సగమే అర్థమౌతుంది. ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటారు మనసులో. బయటకు ఇంకేదో మాట్లాడతారు. ఎక్కడో స్టార్ట్ చేస్తారు, ఇంకెక్కడో ముగిస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అంతకుమించిన విచిత్రం…

బాలయ్య ఏం మాట్లాడినా సగమే అర్థమౌతుంది. ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటారు మనసులో. బయటకు ఇంకేదో మాట్లాడతారు. ఎక్కడో స్టార్ట్ చేస్తారు, ఇంకెక్కడో ముగిస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అంతకుమించిన విచిత్రం జరిగింది. బాలయ్యలో ఇదో కొత్త యాంగిల్.

ఓ కార్యక్రమంలో మాట్లాడిన బాలయ్య… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు, ఆ ప్రహసనంపై స్పందించాలనుకున్నారు. ఏదో గట్టిగా మాట్లాడ్డానికి రెడీ అయ్యారు. పరిశ్రమ, శత్రుత్వం, పోటీ అంటూ కొన్ని పదాలు కూడా నోటి నుంచి దొర్లాయి. అంతలోనే ఆ టాపిక్ ను పక్కనపెట్టేశారు.

ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ కు బహిరంగంగా మద్దతిచ్చారు బాలకృష్ణ. మెగా కాంపౌండ్ మొత్తం ప్రకాష్ రాజ్ కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు గెలిచిన తర్వాత మోహన్ బాబు, తనయుడితో కలిసిస్వయంగా ఈరోజు బాలయ్య ఇంటికొచ్చి కృతజ్ఞతలు తెలిపారు. వీటన్నింటిపై స్పందించాలని బాలయ్య అనుకున్నారు. కానీ ఎదురుగా అల్లు అరవింద్ కూర్చొన్నారు. దీంతో బాలయ్య టాపిక్ మార్చేశారు.

''ఆహా''కు ఓ టాక్ షో చేస్తున్నారు బాలయ్య. దానికి సంబంధించిన ప్రోమో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే బాలయ్య ఇలా మింగలేక..కక్కలేక అవస్థ పడ్డారు. గెలిచింది తను మద్దతిచ్చిన వ్యక్తే అయినప్పటికీ.. ఎందుకో ఆ టాపిక్ పై మాట్లాడలేకపోయారు. ఆయన కావాలనే మాట్లాడలేదా లేక ఎప్పట్లానే ఫ్లోలో మరిచిపోయారా అనే విషయం ఆయనకే తెలియాలి.