పెద్దన్నగా దీపావళికి వస్తున్నాడు సూపర్ స్టార్ రజనీ. అన్నాత్తే అంటూ తమిళంలో వస్తున్న సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. తమిళ వెర్షన్ అన్నాత్తే టీజర్ ఈరోజు విడుదలయింది. శివ దర్శకత్వం లో తయారైన ఈ సినిమా లో కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది.
గతంలో సిస్టర్ సెంటిమెంట్ తో తయారైన పుట్టింటికి రా చెల్లీ, అన్నవరం వంటి సినిమాల తరహాలో రాసుకున్న కథతో ఈ సినిమా తయారవుతోందని వార్తలు వున్నాయి.
విడుదలయిన టీజర్ లో రజనీ తప్ప మరొకరు లేరు. నరుకుళ్లు,పేలుళ్లు తప్ప మరో వ్యవహారం లేదు. తమిళ ప్రేక్షకులకు నచ్చే పండగ, జాతర సీన్ ఒక్కటి మాత్రం యాడ్ చేసారు. రజనీ కి వయసు మీద పడిందని గతంలోనే తెలిసిపోయింది సినిమాలు చూస్తుంటే. ఇప్పుడు అది మరోసారి క్లారిటీగా తెలుస్తోంది.
పక్కాగా బి సి సెంటర్ల ప్రేక్షకులను టార్గెట్ చేసి, ఈ టీజర్ ను కట్ చేసినట్లు, సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన బి గోపాల్ సినిమా సినిమాల టీజర్ ను చూసినట్లు వుంది అన్నాత్తే టీజర్ చూస్తుంటే.