క్రాక్..ఖిలాడీ టైటిళ్ల తరువాత రామారావు ఆన్ డ్యూటీ అనే డిఫరెంట్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే ఆ తరువాత సినిమాకు మాత్రం మళ్లీ తన స్టయిల్ టైటిల్ తో వచ్చేసాడు.
నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో పీపుల్స్ మీడియా నిర్మించే సినిమాకు ఢమాకా అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
నక్కిన త్రినాధరావు-బెజవాడ ప్రసన్న కలిసి రవితేజకు సరిపోయే కథను అల్లారు. ఆ కథకు డమాకా అన్నదే సరైన టైటిల్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా లో ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఖిలాడీ సినిమా వర్క్ విదేశాల్లో కొంత వుండడంతో దానికి పాజ్ బటన్ నొక్కి రామారావు ఆన్ డ్యూటీ సినిమాను దాదాపు ఫినిష్ చేసేసాడు రవితేజ. ఆ వెంటనే ఈ ఢమాకా సినిమాను స్టార్ట్ చేసాడు