జంప్ జిలానీలే పెద్ద సమస్య

ఏ రాజకీయ పార్టీలకైనా జంప్ జిలానీ లు వుంటారు. వాళ్లతో సమస్యలు వుంటాయి. 'నక్క ఒక చోట గౌరీ కళ్యాణమా' అని వెనకటికి సామెత. ఈ పార్టీలో గొడవ పడిన వాడు, ఈ పార్టీలో…

ఏ రాజకీయ పార్టీలకైనా జంప్ జిలానీ లు వుంటారు. వాళ్లతో సమస్యలు వుంటాయి. 'నక్క ఒక చోట గౌరీ కళ్యాణమా' అని వెనకటికి సామెత. ఈ పార్టీలో గొడవ పడిన వాడు, ఈ పార్టీలో రచ్చకెక్కినవాడు, ఈ పార్టీ నుంచి గోడదూకిన వాడు, ఇంకో పార్టీలో మాత్రం బుద్దిగా వుంటాడని ఏమిటి? గ్యారంటీ? 'వెనకటి గుణమేల మాను' అని పెద్దలు అననే అన్నారు. కానీ రాజకీయాల్లో సమస్య ఏమిటంటే, ఇవన్నీ తెలిసినా, జంప్ జిలానీలను తీసుకోకతప్పదు. 

వైకాపా నేత జగన్ కూడా ఇలాగే కొందరిని తీసుకున్నారు. మరి కొందరిని తీసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పటికే ఇలా తీసుకున్నవారితో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ట్రిపుల్ ఆర్ గా ఇటీవల ఫేమస్ అయిన రఘురామకృష్ణంరాజు ఇలా వేరే పార్టీలోంచి వైకాపాలోకి వచ్చిన వారే. మిగిలిన వారిలా జగన్ నే అంటిపెట్టుకుని, పార్టీ పెట్టినప్పట నుంచి వున్నవారు కాదు. ఇప్పుడు ఆయన ఎలా, ఏం చేస్తున్నారో తెలిసిందే.

ఇక ఆనం రెడ్డిగారి సంగతి కూడా తెలిసిందే. ఆయన కూడా పార్టీలోకి మధ్యలో చేరిన వారే. విశాఖ తీరంలో లాస్ట్ మినిట్ లో పార్టీలోకి వచ్చారు అవంతి వారు. ఆయన సంగతేమిటి? తాను ఎలా వచ్చారో?ఎందుకు వచ్చారో మరిచి, గంటా వస్తుంటే, రావడానికి వీల్లేదంటూ రంకెలు వేస్తున్నారు. 

జగన్ తో మొదటి నుంచీ వుంటున్నవారు ఎవ్వరూ ఆయనకు తలనొప్పి తేవడం లేదు. ఇలా మధ్యలో జాయిన్ అయిన జంప్ జిలానీలే తలనొప్పులు తెస్తున్నారు. ఈ సంగతి జగన్ గమనించారో లేదో? ఇక మీద అయినా జంప్ జిలానీలను ప్రోత్సహించడంలో కాస్త జాగ్రత్తగా వుండడం బెటరేమో?

ఇలా చేస్తే కరోనా రాదు

కరోనా బారిన బాలు