మ‌ళ్లీ పెళ్లిపై సునీత‌, ఝాన్సీ స్పంద‌న‌

న‌టి- యాంక‌ర్ గా ఝాన్సీ, సింగ‌ర్ గా సునీత తెలుగు వారికి రెండు ద‌శాబ్దాలుగా ప‌రిచ‌యం ఉన్న వారే. వీరిద్ద‌రి కెరీర్ లు దాదాపు ఒకేసారి మొద‌ల‌య్యాయి. ఒకే సినిమాతో వీరికి మంచి గుర్తింపు…

న‌టి- యాంక‌ర్ గా ఝాన్సీ, సింగ‌ర్ గా సునీత తెలుగు వారికి రెండు ద‌శాబ్దాలుగా ప‌రిచ‌యం ఉన్న వారే. వీరిద్ద‌రి కెరీర్ లు దాదాపు ఒకేసారి మొద‌ల‌య్యాయి. ఒకే సినిమాతో వీరికి మంచి గుర్తింపు కూడా వ‌చ్చింది. 'ఎగిరేపావుర‌మా' సినిమాలో ఝాన్సీ చిన్న పాత్ర‌లో క‌నిపిస్తుంది, ఆ సినిమాలో పాట‌ల‌తో సునీత ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటుంది. 

వీరిద్ద‌రికి ఉన్న మ‌రో సాప‌త్యం వైవాహిక జీవితంలో విడాకులు. న‌టుడు జోగినాయుడుతో ఝాన్సీ చాలా కాలం కింద‌టే విడాకులు తీసుకున్న‌ట్టుంది. సునీత కూడా సింగిల్ మ‌ద‌ర్ గా నిలుస్తోంది. త‌మ వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న విడాకుల గురించి వీరు ప్ర‌స్తావించ‌డానికి భ‌య‌ప‌డ‌రు. ఓపెన్ గానే స్పందిస్తూ ఉంటారు.

అయినా మ‌ళ్లీ పెళ్లెప్పుడు? అనే ప్ర‌శ్న మాత్రం ఇలాంటి వారి ముందు అంత తేలిక‌గా అడిగేది కాదు. మ‌రీ స‌న్నిహితులైతే త‌ప్ప‌. అయితే ఒక టీవీ చాన‌ల్ చాట్ షో లో వీరి ముందు అదే ప్ర‌శ్న వ‌చ్చింది. న‌టుడు అలీ త‌న చాట్ షో లో వీరిని జాయింట్ గా ఆ ప్ర‌శ్న అడిగాడు. ఈ ప్ర‌శ్న‌ను స్వాగ‌తించింది ఝాన్సీ. జ‌వాబు కంటే ప్ర‌శ్న‌కు చాలా ప‌వ‌ర్ ఎక్కువ అని త‌ను న‌మ్ముతానంటూ ఝాన్సీ చెప్పింది. త‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం గురించి స్పందిస్తూ.. చేసుకుంటే త‌ప్ప‌కుండా చెబుతానంటూ ఝాన్సీ తెలివైన స‌మాధానం ఇచ్చింది. ఈ ప్ర‌శ్న‌కు ప్రేక్ష‌కులు ఎవ‌రికి వారు స‌మాధానాలు ఇచ్చుకుంటార‌ని, అలా స‌మాధాన ప‌డిన వారిని నిరుత్సాహప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేదంటూ స‌ర‌దాగా స్పందించింది. 

ఇక సునీత స్పందిస్తూ.. ప్ర‌స్తుతం త‌ను హాయిగా ఉన్న‌ట్టుగా, 'ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేం..' అంటూ వ్యాఖ్యానించి పెళ్లి విష‌యంలో త‌న ఉద్దేశాన్ని చెప్పింది.

ఇలా చేస్తే కరోనా రాదు

కరోనా బారిన బాలు