cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కాజోల్ ప్రేమ క‌థ‌...ఓ రీల్ లైప్ లాంటిదే!

కాజోల్ ప్రేమ క‌థ‌...ఓ రీల్ లైప్ లాంటిదే!

అచ్చం సినిమాను త‌ల‌పించే ప్రేమ క‌థ‌. గొడ‌వ‌తో స్టార్ట్ అయిన బంధం, ఆ త‌ర్వాత స్నేహం ప్రేమ‌గా రూపాంత‌రం చెంది...చివ‌రికి పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. వాళ్లిద్ద‌రూ సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర న‌టులే. ఆ అగ్ర జంటే కాజోల్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌. 21 ఏళ్ల క్రితం వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. కాజోల్ నేడు 46వ పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది.

కాజోల్‌, అజ‌య్ దేవ‌గ‌న్ దంప‌తుల‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న ప‌రిస్థితుల్లో కాజోల్ త‌న కుటుంబంతో ముంబ‌య్‌లో ఉంటోంది. కాజోల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె భ‌ర్త అజ‌య్ ట్వీట్‌...వాళ్లిద్ద‌రి మ‌ధ్య గాఢ‌మైన ప్రేమ‌ను ప్ర‌తిబింబించింది.

‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని అజ‌య్ ట్వీట్ చేశారు. కాజోల్‌కు  ప్ర‌ముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కాజోల్ త‌న త‌న ప్రేమ‌, పెళ్లి త‌దిత‌ర వ్య‌క్తిగ‌త, సినీ విష‌యాలను ఆస‌క్తిక‌రంగా చెప్పుకొచ్చారు.  అజ‌య్‌తో మొద‌టి ప‌రిచ‌యం గురించి కాజోల్ చెప్పిన సంగ‌తి భ‌లే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అని అంటారు. కానీ కాజోల్ విష‌యంలో అందుకు పూర్తి విరుద్ధం. హేట్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అని చెప్పాలి. ఎందు కంటే 1995లో మొద‌టి సారి అజ‌య్‌ను చూసిన‌ప్పుడు కోపంతో ర‌గిలిపోయిన‌ట్టు కాజోల్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా 25 ఏళ్ల క్రితం నాటి సంగ‌తుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు.

‘25 ఏళ్ల క్రితం హల్చుల్‌ సెట్‌లో అజ‌య్‌ని క‌లుసుకున్న‌ట్టు తెలిపారు. తాను షాట్‌ కోసం సిద్ధ‌మై హీరో ఎక్కడ అని అడిగిన‌ట్టు తెలిపారు. హీరో మాత్రం  ఓ మూలన కూర్చొని ఉన్నాడని, అతన్ని కలవడానికి ప‌ది నిమిషాల ముందు ఓ విషయంపై గొడవ పడిన‌ట్టు కాజోల్ గుర్తు చేసుకున్నారు. ఆ త‌ర్వాత సెట్లో త‌మ మ‌ధ్య మాట్లాడుకోవ‌డం మొద‌లైంద‌న్నారు. ప‌ర‌స్ప‌రం అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో స్నేహం కుదిరింద‌న్నారు.

క్ర‌మంగా త‌మ మ‌న‌సులు క‌ల‌వ‌డంతో ప్రేమ చిగురించింద‌న్నారు. నాటి నుంచి త‌మిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఏర్ప‌డింద‌ని, ఇద్ద‌రం క‌లిసి స‌ర‌దాగా తిరిగే వార‌మ‌న్నారు. లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేవాళ్ల‌మ‌ని, త‌మ రిలేష‌న్‌లో సగం కాలం కారులోనే గడిచింద‌ని కాజోల్ నాటి మ‌ధుర జ్ఞాప‌కాల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

అయితే త‌న  ప్రేమ గురించి స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్లు త‌న‌ను హెచ్చ‌రించార‌న్నారు. దీనికి ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలే ద‌న్నారు. ఎందుకంటే అజయ్‌ అప్పటికే హీరోగా మంచి ఊపు మీద ఉన్నార‌న్నారు.  కానీ  అజయ్ మ‌న‌సు ఎలాంటిదో త‌నకు బాగా తెలియ‌డం వ‌ల్ల భ‌య‌ప‌డ‌లేదన్నారు.  అలా నాలుగేళ్లు రిలేష‌న్‌లో ఉన్న త‌ర్వాత పెళ్లి చేసుకోవాల‌నుకుని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆమె తెలిపారు.

కానీ త‌న తండ్రి అందుకు అంగీక‌రించ‌క త‌న‌తో నాలుగు రోజుల పాటు మాట్లాడ‌లేద‌న్నారు. అయితే తాను ప‌ట్టుద‌ల‌గా ఉండ డంతో ఎట్ట‌కేల‌కు త‌ల్లిదండ్రుల‌ను అంగీక‌రించార‌ని చెప్పుకొచ్చారు.  1999, ఫిబ్రవరి 24న వివాహ బంధంతో ఒక్క‌టైన‌ట్టు కాజోల్ తెలిపారు. త‌మ‌కు నైసా అనే కూతురు,  యుగ్ అనే కుమారుడు ఉన్న‌ట్టు తెలిపారు. మొత్తానికి కాజోల్ -అజ‌య్ దేవ‌గ‌న్ మ‌ధ్య ప‌రిచ‌యం, స్నేహం, ప్రేమ‌, పెళ్లి...అన్నీ సినిమాను త‌ల‌పించేలా ఉన్నాయి. 

ఇలా చేస్తే కరోనా రాదు

కరోనా బారిన బాలు

 


×