బాలయ్య-సుగుణసుందరి

పండగ సినిమాల్లో ఒకటైన వీరసింహారెడ్డి నుంచి రెండో పాట వచ్చింది. జై బాలయ్య సాంగ్ తరువాత ఇప్పుడు ఓ డ్యూయట్ ను విడుదల చేసారు. సినిమాలో యంగ్ బాలయ్య -శృతిహాసన్ ల మీద చిత్రీకరించిన…

పండగ సినిమాల్లో ఒకటైన వీరసింహారెడ్డి నుంచి రెండో పాట వచ్చింది. జై బాలయ్య సాంగ్ తరువాత ఇప్పుడు ఓ డ్యూయట్ ను విడుదల చేసారు. సినిమాలో యంగ్ బాలయ్య -శృతిహాసన్ ల మీద చిత్రీకరించిన పాట ఇది. చీమా కుట్టిందే..ప్రేమా పుట్టిందే అంటూ సాగిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాసారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ డైరక్షన్ చేసారు. థమన్ సంగీతం.

బాలయ్యకు కొత్త విగ్ సెట్ చేయడంతో బాగున్నాడు. యంగ్ లుక్ అనిపించేలా వున్నాడు. శృతి హాసన్ కూడా ఈ మధ్యకాలంలో లుక్ బాగుంది. శృతి-బాలయ్య డ్యాన్స్ మూమెంట్స్ బాగా సెట్ అయ్యాయి. ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల బాలయ్య డ్రెస్సింగ్ కూడా బాగానే వుంది.

మొదటి పాట విషయంలో థమన్ ట్రోలింగ్ కు గురయ్యాడు. ఒసే రావులమ్మా పాటను కాపీ కొట్టాడని. ఈ సారి మాత్రం తన ఒరిజినల్ ట్యూన్ తోనే వెళ్లాడు. ఇది జ‌నాలకు పట్టడానికి కొంచెం టైమ్ పడుతుంది.