సినిమాల్లో ఓ సీన్ వుంటుంది. హీరో మిడిల్ క్లాస్..హీరోయిన్ అప్పర్ క్లాస్. అందుకని హీరో బిల్డప్ కోసం ఓ మాంచి ఖరీదైన కారు చూసుకుని దాని పక్కనుంచి వచ్చి అందులోంది దిగిన బిల్డప్ ఇస్తాడు. ఎవరైనా కొత్త కారు కొనుక్కుంటే దాని పక్కన నిల్చుని ఫొటో తీసుకుంటారు. అదే వేరే వాళ్ల కారు పక్కన నిల్చుని ఫొటో తీసుకుంటే బిల్డప్ అనే అంటారు మళ్లీ. ఇలాంటి సంగతులు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వైనం చూస్తుంటే.
అవును అసలు ఇంతకీ ఎవరిదో వెహికల్ కు తాను పేరు పెట్టడం ఏమిటో? తాను వాడుకోవడం ఏమిటో?
క్విడ్ కో ప్రో అంటే ఏమిటి? నీకు ఇది..నాకు అది అనే కదా? మరి రాజమండ్రి రూరల్ సీటు ఆసిస్తున్న అభ్యర్థి టీటైమ్ ఉదయ్ తో వాహనం కొనిపించడం ఏమిటి? తయారు చేయించడం ఏమిటి? దానికి తాను పేరు పెట్టి, పక్కన నిల్చుని ఫోజ్ ఇవ్వడం ఏమిటి? పైగా ఇది తన వాహనం..దాని పేరు వారాహి..దాంతో యుద్దానికి సిద్దం అనడం ఏమిటి? చిత్రంగా.
ఎన్టీఆర్ చైతన్య రథం మీద తిరిగారు అంటే అది ఆయన స్వంతం. కానీ పవన వ్యవహారం అలా కాదు. పార్టీ టికెట్ ఆశిస్తున్నవారి చేత రథం చేయించుకున్నారు. మరి దీన్ని ఏమనాలి? పార్టీ టికెట్ ఆశించకుండా రథం చేయించి ఇస్తే అది వేరే సంగతి. లేదా పార్టీకి విరాళం ఇచ్చి పార్టీ పేరు పెడితే అది వేరే సంగతి.
అలా కాకుండా టీటైమ్ ఉదయ్ పేరునే రిజిస్ట్రేషన్ చేయించి పవన్ వాడుకోవడం అంటే ఏమనాలి?