ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి మంగళవారం సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. పాయల్ రాజ్ పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల అవుతున్న సందర్భంగా నిర్మాతలు స్వాతి రెడ్డి, సురేష్ వర్మ మీడియాతో మాట్లాడారు.
సినిమా నిర్మాణంలోకి ఆలస్యంగా వచ్చానని అనుకోవడం లేదు. పెర్ ఫెక్ట్ టైమ్ లో వచ్చాను అనుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి. మాటీవీలో ఉండగా సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నా. సురేష్ వర్మతో కలిసి ఇప్పటికి సాధ్యమైంది. మేము ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ కథ వచ్చింది. అంతా డెస్టినీ! అలా కుదిరింది.
నిజానికి నేను ఎనభైశాతం ఫిక్స్ అయ్యా ఈ సినిమా చేయాలని, బన్నీ ఈ కథ విన్నారు. 'ఎందుకు కలగా వదిలేయాలి. నువ్వు ట్రై చెయ్. చేసినప్పుడు నీతో ఎవవరైనా పార్టనర్ ఉంటే బావుంటుంది' అని చెప్పాడు. సురేష్ వర్మ గారికి కూడా సేమ్ డ్రీమ్ ఉండటంతో ఇద్దరం కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. బన్నీని అజయ్ భూపతి కలిసినప్పుడు నేను లేను. తర్వాత ఫోనులో నేను మాట్లాడా. 'ఆర్ఎక్స్ 100' కల్ట్ ఫిల్మ్. 'మహాసముద్రం' కూడా బన్నీకి ఇష్టం. అజయ్ భూపతి డైరెక్షన్ సెన్స్ ఇష్టం. గో ఎహెడ్ అన్నారు బన్నీ.
'మా టీవీ' కంటే ముందు నుంచి నేను బన్నీ మంచి ఫ్రెండ్స్. మా ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ ఉంది. మేం కూడా ఫ్రెండ్స్ అయ్యాం. ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే… నేను కాలేజీలో ఉన్నప్పుడు 'అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాలి' అని మా హెచ్ఓడి కండిషన్ పెట్టారు. నాన్నను రిక్వెస్ట్ చేశా. అరవింద్ అంకుల్ గారికి చెప్పమని అడిగా. ఆ టైంలో బెంగళూరు మా కాలేజీలో ఫెస్ట్ కి బన్నీ వచ్చారు. అప్పటి నుంచి మేం చాలా క్లోజ్ అయ్యాం. బన్నీ వైఫ్ స్నేహకి నేను క్లోజ్. మా ఆయన ప్రణవ్, స్నేహ స్కూల్ మేట్స్. అలా మరింత దగ్గర అయ్యాం.
ఈ జానర్ ఫిల్మ్ చేయాలని అనుకోలేదు. కామెడీ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తా. థ్రిల్లర్స్ తక్కువ. అజయ్ భూపతి నేరేషన్ విని 'ఈ మూవీ చేస్తే బావుంటుంది' అనిపించింది. సినిమాలో ఓ సందేశాన్ని చెప్పిన విధానం బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్… అన్నీ ఉన్నాయి.
ఈ ఏడాది సినిమా కాకుండా ఇంకా చాలా వ్యాపారాలు స్టార్ట్ చేశా. మేం ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం స్కేల్ పెరిగింది. ఆ బడ్జెట్ పెడితే అజయ్ భూపతి గారి విజన్ స్క్రీన్ మీదకు వస్తుందని అనిపించింది. రొటీన్ కాకుండా డిఫరెంట్ గాచేశాం. ఈ తరహా కథలు, జానర్ సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకని, హ్యాపీ! మ్యూజిక్, నటీనటుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు.