నా సామి రంగా.. ఏం స్పీడ్

నాగ్ హీరోగా చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న సినిమా నా సామి రంగా. కొత్త దర్శకుడు బెన్నీ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. ఈ సినిమా…

నాగ్ హీరోగా చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న సినిమా నా సామి రంగా. కొత్త దర్శకుడు బెన్నీ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. ఈ సినిమా ఈ మధ్యనే స్టార్ట్ చేసినట్లు వుంది. 

కానీ ఎంత ఫాస్ట్ గా పూర్తవుతోందీ అంటే డిసెంబర్ 5 కు నాలుగు పాటలు మినహా మిగిలిన సినిమా అంతా అయిపోతుంది. ఇప్పటికే ఒక పాట షూట్ జరుగుతోంది. డిసెంబర్ తొలివారం లో ఫైట్ సీన్ చిత్రీకరణ వుంటుంది.

సంక్రాంతి సెంటిమెంట్ ను అస్సలు మిస్ కాకూడదని నాగార్జున పట్టుదలగా వర్క్ చేస్తున్నారు. నిర్మాత చిట్టూరి శ్రీను కూడా అదే టార్గెట్ గా వున్నారు. ఈ సినిమాకు హిట్ మ్యూజికల్ పెయిర్ కీరవాణి-చంద్రబోస్ కలిసి అయిదు పాటలు అందిచబోతున్నారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున మాస్ లుక్‌, ఎక్స్ టార్డీనరీ ప్రెజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి అంచనాలను అమాంతం పెంచింది.