అన్నిటికీ జగనే కారణం అంటే ఎలా..?

ఇక్కడెవరో నన్ను పూలచొక్కా అన్నారు, వెంటనే లెక్చరర్ సారీ చెప్పాలంటూ నువ్వు-నేను సినిమాలో సునీల్ కామెడీ చేస్తాడు. సరిగ్గా అలానే కామెడీ చేస్తున్నారు టీడీపీ నేతలు. గ్రామాల్లో ఎవరెవరో కొట్టుకుంటే.. టీడీపీ వాళ్లని, వైసీపీ…

ఇక్కడెవరో నన్ను పూలచొక్కా అన్నారు, వెంటనే లెక్చరర్ సారీ చెప్పాలంటూ నువ్వు-నేను సినిమాలో సునీల్ కామెడీ చేస్తాడు. సరిగ్గా అలానే కామెడీ చేస్తున్నారు టీడీపీ నేతలు. గ్రామాల్లో ఎవరెవరో కొట్టుకుంటే.. టీడీపీ వాళ్లని, వైసీపీ వాళ్లు కొట్టారంటూ రాద్ధాంతం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నెల్లూరుజిల్లా పర్యటన నేపథ్యంలో అక్కడో పెద్ద సీన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయింది పచ్చ బ్యాచ్. ఓ దళితుడిపై వైసీపీ వర్గాలు దాడి చేశాయంటూ అర్థరాత్రి ఆస్పత్రికి వెళ్లి హడావిడి చేశారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి సోమిరెడ్డి సహా స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఈ హడావిడిలో భాగమవడం విశేషం.

దళితుడిపై దాడి జరిగిన మాట వాస్తవమే, అయితే ఆ దాడి చేసిన వారు కూడా దళితులే, పైగా బంధువులు. మరిక్కడ రెండు పార్టీలు, రెండు వర్గాల ప్రస్తావన ఎందుకు. దళితుడిపై దాడి చేశారంటూ టీడీపీ నేతలు రెచ్చిపోవడం, మిగతా వారిని రెచ్చగొట్టాలని చూడటం దేనికి? కేవలం చంద్రబాబు పర్యటన నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.

గతంలో ఇదే జిల్లాలో జరిగిన రెండు గొడవల్లో, ఒకదానికి అక్రమ సంబంధం కారణమైతే, మరోదానికి పొలం తగాదా కారణం. ఈ రెండిటికీ పార్టీ రంగు పులిమి రాజకీయ లబ్ధిపొందాలని చూసిన టీడీపీ నేతలు అభాసుపాలయ్యారు. ఇప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా, తెలిసినా అధికారపక్షంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకుని ఓ పథకం ప్రకారం అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అనుకూల మీడియాతో వీటిని అంతర్జాతీయ సమస్యలుగా చిత్రీకరించి రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకుంటే బాగుంటుంది.

ఎక్కడ ఎవరికి ఏ చిన్న అపాయం జరిగినా, వెంటనే మేం దీన్ని ఖండిస్తున్నాం, జగనే దీనికి కారణమంటూ టీడీపీ నాయకులు స్టేట్ మెంట్లివ్వడం రివాజుగా మారిపోయింది. నాలుగు నెలలే వీరి ఆపసోపాలు తట్టుకోలేకపోతున్నాం, నాలుగున్నరేళ్లు గడిచే సరికి టీడీపీ నేతలు ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకుంటేనే జనాలకు మతిపోతోంది. 

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్