అనుకున్నదే జరిగింది.. టాలీవుడ్ లో వేరుకుంపటి

ముందుగా నాగబాబు, ఆ తర్వాత ప్రకాష్ రాజ్, ఆ వెంటనే శివాజీరాజా.. ఇలా వరుసపెట్టి అంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామాలు చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో మరిన్ని రాజీనామాలు చోటుచేసుకోబోతున్నాయనే ఊహాగానానలు…

ముందుగా నాగబాబు, ఆ తర్వాత ప్రకాష్ రాజ్, ఆ వెంటనే శివాజీరాజా.. ఇలా వరుసపెట్టి అంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామాలు చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో మరిన్ని రాజీనామాలు చోటుచేసుకోబోతున్నాయనే ఊహాగానానలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవే నిజం కాబోతున్నాయి. ''మా'' కు పోటీగా ''ఆత్మ'' రాబోతోంది.

''మా'' అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ''ఆత్మ'' అంటే ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని అర్థం. తాజాగా ''మా'' ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్, మరికొద్దిసేపట్లో ''ఆత్మ'' ను ప్రకటించబోతున్నారు.

ఇది ఆరంభం మాత్రమే. అసలు కథ ఇంకా ఉందంటూ తాజాగా తన ప్రెస్ మీట్ ను ముగించారు ప్రకాష్ రాజ్. అప్పుడే చాలామందికి అనుమానాలు పొడసూపాయి. ఆ ఊహాగానాల్ని నిజం చేస్తూ తన ''ఆత్మ'' ను ప్రవేశపెట్టబోతున్నారు ప్రకాష్ రాజ్. ఇదే కనుక అధికారికంగా కార్యరూపం దాలిస్తే.. ఇకపై టాలీవుడ్ లో ఆర్టిస్టుల కోసం 2 అసోసియేషన్లు అన్నమాట.

''మా''లో కేవలం తెలుగు వాళ్లు మాత్రమే పోటీ చేయాలనే నిబంధన తీసుకొస్తారనే చర్చ నడుస్తోంది. దానికి విరుద్ధంగా ''ఆత్మ''లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండబోతున్నాయి. టైటిల్ కు తగ్గట్టే అందరి ఆత్మ ఒకటే అని చెప్పబోతున్నారు.

ఇదే కనుక సాకారమైతే.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం ''ఆత్మ''లోకి వస్తుంది. గెలిచిన శ్రీకాంత్ లాంటి వాళ్లు కూడా (ఊహాగానాలు నిజం చేస్తూ) అక్కడ రాజీనామా చేసి ''ఆత్మ''లోకి వచ్చేయడం ఖాయం. కేవలం ప్యానెల్ తో ఇది ఆగదు. 900మందికి పైగా ఉన్న సభ్యుల్లో కూడా ఇది చీలిక తేవడం గ్యారెంటీ. 

అందులో సభ్యత్వం ఉంటే, ఇందులో ఇవ్వకూడదు.. ''ఆత్మ''లో సభ్యత్వం తీసుకుంటే “మా”లో సభ్యత్వం పొందకూడదు లాంటి రూల్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఏ విషయం మరికాసేపట్లో తేలిపోతుంది.