మహేష్ కోనేరు కన్నుమూత

యంగ్ ప్రొడ్యూసర్, జర్నలిస్ట్, పీఆర్వో మహేష్ కోనేరు మరణించారు. ఇది టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ నే.  Advertisement విశాఖ నుంచి వచ్చి వెబ్ జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి, పీఆర్వోగా బాహుబలి వంటి…

యంగ్ ప్రొడ్యూసర్, జర్నలిస్ట్, పీఆర్వో మహేష్ కోనేరు మరణించారు. ఇది టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ నే. 

విశాఖ నుంచి వచ్చి వెబ్ జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి, పీఆర్వోగా బాహుబలి వంటి సినిమాలకు పని చేసి, ఆపై నిర్మాతగా మారారు మహేష్ కోనేరు. యంగ్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. 

వివాదరహితంగా వుంటూ, అందరికీ ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 118, నా నువ్వే, మిస్ ఇండియా, తిమ్మరసు వంటి సినిమాలు నిర్మించారు. 

నాగశౌర్య, కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. పలు డబ్బింగ్ సినిమాల హక్కులు కొని డిస్ట్రిబ్యూటర్ గా కూడా మారారు.

ఇప్పుడు కూడా కొన్ని తమిళ భారీ సినిమాలు హక్కులు కొనే పనిలో భాగంగా చెన్నయ్ వెళ్లాల్సి వుంది. ఈ లోగా ఈ ఉదయం హార్ట్ అటాక్ రావడంతో మొత్తం విషాదం అలుముకుంది. ఇటు జర్నలిస్ట్ కమ్యూనిటీకి, అటు టాలీవుడ్ కు ఇది అత్యంత విషాదకర వార్త.