సోషల్ మీడియాలో ఘాటుగా కామెంట్స్ పెట్టే శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈసారి ఏకంగా వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిపై పోస్టులు పెట్టింది. అతడికి ఒక్కరోజు భార్యగా ఉన్నాచాలని, ఆ తర్వాత చనిపోయినా తనకేం అభ్యంతరం లేదని పోస్ట్ పెట్టింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటు వైసీపీలో ఓ చిన్నపాటి ప్రకంపనం సృష్టించింది.
నువ్వు మగాడ్రా బుజ్జి అంటూ ప్రారంభించిన తన పోస్టుల పరంపరను వరుసగా కొనసాగించింది శ్రీరెడ్డి. తొలిసారిగా తన పెళ్లిపై స్పందిస్తున్నానని ప్రకటిస్తూనే, సిద్దార్థ్ రెడ్డి లాంటి వ్యక్తికి భార్యగా ఒక్కరోజు జీవించినా చాలంటూ పోస్ట్ పెట్టింది. దీనిపై సోషల్ మీడియాలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దయచేసి మా నాయకుడ్ని వదిలేయాలంటూ కొంతమంది కామెంట్ చేస్తే, ఓసారి సిద్దార్థ్ ను అడిగి చూడమని మరికొందరు ఉచిత సలహాలిచ్చారు.
నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సిద్దార్థ్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఆయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీలోకి వచ్చి జగన్ దృష్టిలో పడ్డాడు. నందికొట్కూరు రిజర్వ్ డ్ స్థానం కావడంతో, నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేసి, అన్నీ తానై వ్యవహరించి పార్టీ గెలుపు కోసం కష్టపడ్డాడు.
సిద్దార్థ్ రెడ్డి వ్యవహారశైలి మొత్తం అర్జున్ రెడ్డిలో హీరో పాత్ర టైపులో ఉంటుంది. అదే శ్రీరెడ్డిని అమితంగా ఆకర్షించినట్టుంది. అందుకే అతడికి వన్ డే వైఫ్ గా ఉండాలనే కోరికను వ్యక్తంచేసింది. అన్నట్టు పవన్ పై రెగ్యులర్ గా విరుచుకుపడే శ్రీరెడ్డి, ఈమధ్య అతడిపై విమర్శల డోసు తగ్గించింది.