తమన్నా కానుక విలువ రూ.రెండు కోట్లా!

'సైరా నరసింహారెడ్డి' సినిమా తమన్నాకు కొత్త ఊపును ఇచ్చింది. ఈ మధ్యనే తమన్నా ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తే దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అభినేత్రి టూ పేరుతో ఒక సినిమా వచ్చి వెళ్లింది.…

'సైరా నరసింహారెడ్డి' సినిమా తమన్నాకు కొత్త ఊపును ఇచ్చింది. ఈ మధ్యనే తమన్నా ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తే దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అభినేత్రి టూ పేరుతో ఒక సినిమా వచ్చి వెళ్లింది. అలా ఎవరికి పట్టకుండా పోతున్న దశలో తమన్నాకు ఈ సినిమా మంచి ఊరటను ఇచ్చింది. అటు ప్రాధాన్యత ఉన్న  పాత్ర, ఇటు పేరు తెచ్చిన పాత్రగా 'సైరా నరసింహారెడ్డి'లో ఆమె చేసిన పాత్ర నిలుస్తోంది.

ఆ సంగతలా ఉంటే సందర్భంలో రామ్ చరణ్ , ఉపాసనలతో తమన్నా సాన్నిహిత్యం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో నటించినందుకు తమన్నాకు వారు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో కానీ, ఖరీదైన కానుకను మాత్రం ప్రజెంట్ చేశారట. ఆ విషయాన్ని తమన్నా స్వయంగా ప్రకటించింది. ఫొటోను పోస్టు చేసింది. కానుక ఇచ్చినందుకు చరణ్, ఉపాసనలకు కృతజ్ఞతలు చెప్పింది.

ఇంకేముంది.. ఆ కానుక విలువ ఎంత ఉంటుందనేది.. ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల అంచనా ప్రకారం.. దాని విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలు! ఆ మేరకు ఆ కానుక విలువను స్క్రీన్ షాట్లుగా కామెంట్ పోస్టు చేస్తున్నారు నెటిజన్లు! కానుక ఖరీదును తీసుకున్న వాళ్లు, ఇచ్చిన వాళ్లు ప్రస్తావించరు కాబట్టి, అటు చరణ్, ఇటు తమన్నాలు కామ్ గా ఉన్నారు.