'సైరా నరసింహారెడ్డి'తో దర్శకుడిగా తన పటిమను చాటుకున్నాడు సురేందర్ రెడ్డి. ఉయ్యాలవాడ కథను అంత రసవత్తరంగా చెప్పవచ్చు అనే విషయాన్ని సురేందర్ నిరూపించుకున్నారు. ఇది వరకూ ఉయ్యాలవాడ కథ గురించి పుస్తకాల రూపంలో పలు బయోగ్రఫీలు ఉన్నాయి. మూలాలను మిస్ కాకుండానే, వాస్తవానికి అతీతంగా కాకుండానే..ఉయ్యాలవాడ కథను సురేందర్ రెడ్డి రసవత్తరంగా చెప్పారు. అదే సమయంలో కమర్షియల్ గా విజయం అందుకునేలా సినిమాను రూపొందించాడు ఈ దర్శకుడు.
ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి వాట్ నెక్ట్స్ అంటే.. ప్రభాస్ పేరు వినిపిస్తూ ఉంది. 'సాహో' తర్వాత ప్రభాస్ ఇప్పటికే ఒక సినిమాకు కమిట్ అయి ఉన్నారు. 'జిల్' దర్శకుడి డైరెక్షన్లో ఆ సినిమా ఉంది. ఇంతలో ఇప్పుడు సురేందర్ రెడ్డి- ప్రభాస్ కాంబోలో ఒక సినిమా రూపొందుతోందని ప్రచారం మొదలైంది. సైరా, సాహో వంటి భారీ సినిమాలకు పని చేసిన దర్శకుడు, హీరో కాంబినేషన్లోని సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో!