నెక్స్‌ట్ సినిమాలు లైన్లో పెడుతోన్న డైరెక్టర్లు

రాజమౌళికి, అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమను మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. రేపో, మాపో షూటింగ్స్ మొదలవుతాయనే ఆశలు ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయాయి.  Advertisement కరోనా…

రాజమౌళికి, అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమను మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. రేపో, మాపో షూటింగ్స్ మొదలవుతాయనే ఆశలు ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయాయి. 

కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు షూటింగ్స్ మొదలు పెట్టకూడదని అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారు. 

కనీసం ఈ ఏడాది చివరి వరకు షూటింగ్స్ మొదలు కావడం కష్టమనే అంటున్నారు. ఈ నేపథ్యంలో టాప్ డైరెక్టర్లు తదుపరి చిత్రాలను ఖరారు చేసుకుని, కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విపత్తు తొలగిపోయిన తర్వాత తమ చిత్రాల షూటింగ్ పూర్తి చేసుకుని, తదుపరి చిత్రం కోసం ఎక్కువ సమయం వృధా అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఆచార్య షూటింగ్ మధ్యలో నిలిచిపోవడంతో కొరటాల శివ ఈ టైమ్‌లో అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసేసుకున్నాడు.

రాజమౌళి కూడా మహేష్‌తో చేసే చిత్రానికి స్టోరీ ఫైనలైజ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్ ఏమో ఎన్టీఆర్ చిత్రానికి కథ రాసేసి, తదుపరి చిత్రాలకు స్టోరీలైన్స్ రెడీ చేసుకునే పనిలో వున్నాడు. పవన్‌తో చేసే సినిమా కోసం హరీష్ శంకర్ పకడ్బందీ కథ, కథనాలు సిద్ధం చేస్తున్నాడు. 

‘వి’ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, విక్రమ్ కుమార్ తదితరులు తమ తదుపరి చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా వున్నారు. ఈ ఏడాది ఎలాగో వృధాగా పోయింది కనుక తదుపరి సినిమాలకి అసలు గ్యాప్ రాకుండా డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.

చంద్రబాబు స్వయంకృతాపరాధం