గ్రామ సచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు పథకాలను తామే ముందు తీసుకొచ్చామని అబద్దాలు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కంటిచూపు మందగించినట్లుందని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ ను చూసి చంద్రబాబు ఓర్వ లేకపోతున్నారని ఆయన ద్వజమెత్తారు.
అమరావతిలో తాత్కాలికంగా కట్టిన సచివాలయాన్నే చంద్రబాబు గ్రామ సచివాలయ వ్యవస్థ అనుకున్నారేమోనని ఎద్దేవా చేశారు.
ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబులా అనవసరమైన మాటలు చెప్పడం రాదని.. ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారని అన్నారు.