ఎప్పటిమాదిరిగానే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు విషయంలో తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు. బయట అంత రాజకీయ రచ్చ అవుతూంటే ఇన్నాళ్ళూ ఆయన సైలెంట్ గా ఉన్నారు. గంటా వైసీపీలో చేరుతారు అని జనసేన వైపు మళ్ళుతారు అని ప్రచారం పీక్స్ లో సాగినా మాజీ మంత్రి నుంచి కనీన ఖండన లేదు.
పైగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం పాటిస్తున్నారు అన్నది కూడా హైలెట్ అవుతూ వచ్చింది. దాంతో అలాంటిదేమి లేదు అని ఒక ప్రకటన గంటా వర్గం నుంచి రాలేదు. ఇపుడు కూడా ఆయన పాత పాటే పాడారు అంటున్నారు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన గంటా మాట్లాడుతూ తాను పార్టీ మారుతాను అని ఎక్కడైనా చెప్పానా అని మీడియానే ఎదురు ప్రశ్నిస్తున్నారు.
తాను ఒకవేళ పార్టీ మారితే స్వయంగా మీడియాకు చెబుతాను అని ఆయన చెప్పడం విశేషం. అంటే పార్టీ మారను అని ఒక్క స్పష్టమైన ప్రకటన అయితే ఆయన నుంచి రాలేదు అని అంటున్నారు. అంటే గంటా పార్టీ మారుతారు అన్న సస్పెన్ అయితే అలా కంటిన్యూ అవుతోంది అంటున్నారు.
గంటా టీడీపీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వారికే టికెట్లు అని చంద్రబాబు ప్రకటించారు. ఆ లెక్కన చూస్తే గంటాకి టికెట్ కన్ ఫర్మ్. అయినా ఆయన తాను ఎప్పటికీ టీడీపీ అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవడమేంటని టీడీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల దాకా గంటా పార్టీ మార్పు అని మీడియా వార్తలు రాసుకునేందుకు మాత్రం ఎలాంటి ఢోకా లేదనే అంటున్నారు.