రూ.50 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా, ఒక‌రికి ఉద్యోగం

ఎల్జీ పాలిమ‌ర్స్ దుర్ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి పెద్ద మ‌న‌సు చాటుకున్న జ‌గ‌న్ స‌ర్కార్‌…మ‌రోసారి అదే మాన‌వత్వాన్ని ప్ర‌ద‌ర్శించింది. విశాఖ షిప్‌యార్డ్  దుర్ఘ‌ట‌న‌లో 11 మంది శ‌నివారం మృత్యువాత ప‌డిన…

ఎల్జీ పాలిమ‌ర్స్ దుర్ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి పెద్ద మ‌న‌సు చాటుకున్న జ‌గ‌న్ స‌ర్కార్‌…మ‌రోసారి అదే మాన‌వత్వాన్ని ప్ర‌ద‌ర్శించింది. విశాఖ షిప్‌యార్డ్  దుర్ఘ‌ట‌న‌లో 11 మంది శ‌నివారం మృత్యువాత ప‌డిన విష‌యం తెలిసిందే.

మృతుల కుటుంబాల‌కు భారీ ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగాన్ని ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించింది. షిప్‌యార్డ్‌లో ప్ర‌మాద స్థ‌లాన్ని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ఆదివారం ప‌రిశీలించారు. అనంత‌రం షిప్‌యార్డ్ యాజ‌మాన్యం, కాంట్రాక్ట్ సంస్థ‌ల‌తో ఆయ‌న  చ‌ర్చించారు.

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విశాఖ షిప్‌యార్డ్ మృతుల కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి రూ. 50 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారంగా ఇస్తామ‌న్నారు. అలాగే మృతుల కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వెల్ల‌డించారు.  షిప్‌యార్డు ప్ర‌మాదంపై కొంద‌రు ప‌నిగట్టుకుని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇది స‌రైంది కాద‌న్నారు.

పవన్ కళ్యాణ్ తో నా ఎక్స్పీరియన్స్

కరోనా తగ్గిపోయింది