సడెన్ గా మోడీ భజనేంది అయ్యన్నా?

అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్.  టీడీపీ పుట్టుక నుంచి ఉన్న నాయకుడు. చెప్పాలంటే చంద్రబాబు కంటే కూడా  ఆయనే పార్టీలో సీనియర్ నేత.   అటువంటి అయ్యన్నపాత్రుడు హఠాత్తుగా ఇపుడు మోడీ భజన చేస్తున్నారు. Advertisement అయోధ్యలో…

అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్.  టీడీపీ పుట్టుక నుంచి ఉన్న నాయకుడు. చెప్పాలంటే చంద్రబాబు కంటే కూడా  ఆయనే పార్టీలో సీనియర్ నేత.   అటువంటి అయ్యన్నపాత్రుడు హఠాత్తుగా ఇపుడు మోడీ భజన చేస్తున్నారు.

అయోధ్యలో రామాలయాన్ని మోడీ ప్రధానిగా ఉండబట్టే నిర్మించగలుగుతున్నామంటూ కితాబు ఇస్తున్నారు. అయోధ్య రామాలయం హిందువుల కల అని, దాన్ని వాజ్ పేయ్, అద్వానీ వంటి వారు సాకారం చేయాలనుకున్నా కుదరలేదని చెప్పుకొచ్చారు.

కేవలం నరేంద్రమోడీ వల్లనే అది సాధ్యపడిందని, మోడీ కాబట్టే అయోధ్యలో రామాలయం  నిజమైందని కూడా పొగుడుతున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో ప్రతీ హిందువూ భాగస్వామ్యం కావాలని కూడా అయ్యన్నపాత్రుడు పిలుపు ఇవ్వడం విశేషం.

రామాయల నిర్మాణం కోసం ప్రతీ హిందువు కనీసం పది రూపాయలు ఇవ్వాలని కూడా అయ్యన్నపాత్రుడు కోరడం విశేషం. నిజానికి ఈ తరహా పిలుపు ఏదీ అటు ఆరెస్సెస్ కానీ నిఖార్సైన  బీజేపీ నేత కానీ ఇంతవరకూ ఇవ్వలేదు.

మరి అపర హిందూత్వగా అయ్యన్న అవత‌రించి మరీ ఇంతలా మోడీని కీర్తించడం వెనక మతలబు ఏంటి అన్నదే రాజకీయాల్లో చర్చగా ఉంది. ఒకనాడు ఇదే అయ్యన్నపాత్రుడు మసీదులను కూల్చేసిన పార్టీ,  దేశంలో హిందూ ముస్లిముల మధ్య చిచ్చు పెట్టిన పార్టీ అంటూ బీజేపీని చెడుగుడు ఆడిన చరిత్రా ఉంది.

ఇపుడు  అన్నీ మరచి సిసలైన రామభక్తుడుగా అయ్యన్న మారడం వెనక వయోభారంతో వచ్చిన వేదాంతంతో కూడిన భక్తి అయినా ఉండాలి, అది కాకపోతే తమ పార్టీ అధినేత మాదిరిగా మోడీ స్తోత్రపాఠాలే ఈ కష్టకాలంలో శరణ్యమన్న రాజకీయ ఎత్తుగడలు అయినా అయి ఉండాలి.  ఏది ఏమైనా అయ్యన్న వీడియో విడుదల చేసి మరీ ఇంతలా మోడీని ఎత్తేయడం చూస్తూంటే తమ్ముళ్ళకు ఎక్కడో డౌట్ కొడుతోందిట.

పవన్ కళ్యాణ్ తో నా ఎక్స్పీరియన్స్