రాశిఫలాలు.. 02.08.20 నుంచి 09.08.20 వరకు

మేషం: చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు మరింత చేయూతనిస్తారు. ఆర్థికం.. సొమ్ములకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మీ అవసరాలు గుర్తించి స్నేహితులు కూడా సహకరిస్తారు. ఆస్తులపై…

మేషం: చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు మరింత చేయూతనిస్తారు. ఆర్థికం.. సొమ్ములకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మీ అవసరాలు గుర్తించి స్నేహితులు కూడా సహకరిస్తారు. ఆస్తులపై పెట్టుబడులు పెడతారు. కుటుంబం..మీ యుక్తి, తెలివితేటలకు కుటుంబసభ్యులు ముగ్ధులవుతారు. శుభకార్యాల నిర్వహణ కొంతకాలం వాయిదా వేస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్యం…కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు.. లాభాల దిశగా సాగుతారు. అలాగే, నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు…కోరుకున్న విధంగా మార్పులు ఉండవచ్చు. సహచరుల సహకారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కాస్త ఊరటకలుగుతుంది. మహిళలకు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృషభం: మొదట్లో కొన్ని ఆటుపోట్లు, అవాంతరాలు ఎదురైనా క్రమేపీ అధిగమిస్తారు. చేపట్టిన కార్యక్ర మాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికం.. ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం. స్థిరాస్తులు కొనుగోలు కోసం కొంత వెచ్చిస్తారు. కుటుంబం…భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. సోదరులు మీతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంతానపరంగా కీలక సమాచారం అందుతుంది. రాహు, చంద్రుల వీక్షణాల వల్ల తల్లి, లేదా తల్లి తరఫు వారి ఆరోగ్యంపై కొంత ఆదుర్దా చెందుతారు. ఆరోగ్యం..వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది.  వ్యాపారాలు…అనుకున్న లాభాలు దక్కినా పెట్టుబడులు ఆలస్యమై కొంత ఇబ్బంది పడతారు. ఉద్యోగాలు….కొన్ని మార్పులు ఇష్టంలేకున్నా తప్పనిపరిస్థితి ఉంటుంది. పైస్థాయి వారి ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవేత్తల యత్నాలలో కదలికలు ఉండవచ్చు. మహిళలకు స్వల్ప ధనలబ్ధి. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.

మిథునం: మీరు చేపట్టిన వ్యవహారాలు సకాలంలోనే పూర్తి కావడం విశేషం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దష్టి పెడతారు. ఆర్థికం…అవసరాలకు కొంత లోటు ఏర్పడినా ఏదో విధంగా సర్దుబాటు కాగలదు. రుణాలు చాలావరకూ తీరతాయి. ఇతరుల వద్ద పెండింగ్ పడిన సొమ్ములు కూడా అందుకుంటారు. కుటుంబం…తల్లితరఫు వారు మీకు కొంత సహాయపడతారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపించవచ్చు. ఆరోగ్యం…స్వల్ప రుగ్మతలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు.. ఆశించిన లాభాలు పొందుతారు. కొత్త భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగాలు…కొన్ని మార్పులకు సిద్ధపడాలి. అయితే పనిభారం కొంత తగ్గే సూచనలు. కళారంగం వారికి దీర్ఘకాలిక విరామం అనంతరం కొన్ని అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు ఆస్తి లాభం కలుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థికం…సొమ్ములు సకాలంలో అందుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆస్తుల విక్రయాలను పూర్తి చేసి మరింత సొమ్ము దక్కించుకుంటారు. అయితే కొన్ని ఖర్చులు హఠాత్తుగా వచ్చి కొంత గందరగోళం పెట్టవచ్చు. కుటుంబం.. అందరి ప్రేమను పొందుతారు. భార్యాభర్తలు, సోదరీ,సోదరుల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది. పెద్దవారి ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. ఆరోగ్యం…ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు…విస్తరణ కార్యక్రమాలు కొంత ముమ్మరం చేస్తారు. కొత్త పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగాలు.. విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. ఆదిత్య హదయం పఠించండి.

సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. కాంట్రాక్టులు ఎట్టేకలకు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. ఆర్థికం…అనుకున్న మేరకు డబ్బు అంది అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబం.. రాహు, చంద్రుల వీక్షణాల వల్ల సంతానపరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఎదురుకావచ్చు. అయితే సోదరుల  సలహాలతో కొంత అధిగమిస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. ఆరోగ్యం….స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు….ఆశించిన విధంగా లాభాలు పొందుతారు. భాగస్వాముల సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు. ఉద్యోగాలు.. ఇంతకాలం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం సాధిస్తారు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. గణేశాష్టకం పఠించండి.

కన్య: ఎంతటి కార్యాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మారతారు. అలాగే, విద్యాపరంగా కొన్ని అవాంతరాలు ఎదురుకావచ్చు. ఆర్థికం…ఆశించిన విధంగా డబ్బు చేతికందుతుంది. రుణబాధలు చాలావరకూ తొలగుతాయి. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి మరింత సొమ్ము అందుతుంది. కుటుంబం…అందరి ఆదరణ పొందుతారు. కుటుంబసభ్యులతో వైరుధ్యాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై సోదరులతో సంప్రదిస్తారు. ఆరోగ్యం….దీర్ఘకాలిక రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు….క్రమేపీ విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు….కోరుకున్న మార్పులు సంభవం. పైస్థాయి వారి సహకారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు ధనలాభం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థికం…అవసరాలకు ఊహించని విధంగా సొమ్ములు అందుతాయి. షేర్ల విక్రయాలు కూడా సకాలంలో పూర్తి చేసి అదనపు సొమ్ము పొందుతారు. స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. కుటుంబం.. రాహు,చంద్రుల వీక్షణాల కారణంగా సోదరీలు, సోదరులతో అకారణంగా తగాదాలు. వారి ద్వారా ఒత్తిడులు పెరుగుతాయి. అయితే సంతానపరంగా ఎదురైన ఇబ్బందులు తొలగడం ఊరటనిచ్చే విషయం. ఆరోగ్యం…కొంత నలత చేసి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు.. క్రమేపీ లాభాలు అందుతాయి. అనుకున్న విధంగా పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు.. పనిభారం నుంచి కాస్త బయటపడతారు. ఉన్నత పోస్టులు కొన్ని దక్కించుకుంటారు. రాజకీయవేత్తలకు ఆశలు నెరవేరతాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో శ్రమ తప్పదు. వివాహ, ఉద్యోగయత్నాలు ముందు కు సాగవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొం టారు. తరచూ ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థికం.. సొమ్ముకు ఇబ్బంది పడతారు. అప్పులు చేస్తే గానీ అవసరాలు తీరని పరిస్థితి ఎదురుకావచ్చు. స్థిరాస్తులు విక్రయించినా సంబంధిత డబ్బు అందడంలో జాప్యం కొంత నిరాశ పరుస్తుంది. కుటుంబం…రాహు, చంద్రుల వీక్షణాల వల్ల కుటుంబసభ్యుల మధ్య వైరం. మీరు మంచి చెప్పినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. మీపై బంధువులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం బాధిస్తుంది. ఆరోగ్యం…కొన్ని రుగ్మ తలు బాధిస్తాయి. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారా లు.. ఆశించిన లాభాలు కష్టమే. భాగస్వాములు సైతం వెనుకడుగు వేస్తారు. ఉద్యోగాలు.. అదనపు పనిభారం తో సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలు కాస్త నిదానం పాటించాలి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: రాహు, చంద్రుల వీక్షణాల వల్ల వ్యక్తిగతంగా మానసిక అశాంతి పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆర్థికం…సొమ్ము ఊహించని విధంగా అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు చాలావరకు తీరతాయి. ఆస్తులు, షేర్ల విక్రయాలు పూర్తి చేసి లాభాల ద్వారా కొంత ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబం…అందరిలోనూ గుర్తింపు పొందుతారు. మీపై కుటుంబసభ్యులు ఆదరణ చూపుతారు. మీకు అప్పగించిన బాధ్యతలు సోదరులు కూడా పంచుకుంటారు. ఆరోగ్యం….క్రమేపీ రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు.. ఆశించిన విధంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు…అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారులు పూర్తి సహకారం అందిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల ఏర్పాటులో విజయం పొందుతారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అంగారక స్తోత్రాలు పఠించండి. 

మకరం: ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. దూరమైన మిత్రులు దగ్గరకు చేరతారు. రాహు, చంద్రుల వీక్షణాల వల్ల మనశ్శాంతి లోపించవచ్చు. అమ్మవారిని ధ్యానించండి. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఆర్థికం….ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. హఠాత్తుగా కొంత సొమ్ము అందుకుంటారు. షేర్లలో పెట్టుబడులు పెడతారు. కుటుంబం…మీపై వచ్చిన అభాండాలు తొలగుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం….శారీరక రుగ్మతలు చాలావరకూ తొలగు తాయి. స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాలు.. పెట్టు బడులకు తగిన లాభాలు అందుతాయి. భాగస్వా ములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలు.. కొన్ని  మార్పులు జరిగినా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు మరింత ఆదరణ లభిస్తుంది. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. లక్ష్మీస్తుతి చేయండి.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు.  కొన్ని పనులు చకచకా పూర్తి చేస్తారు. మిత్రులు మీ అభివద్ధికి మరింత సహకరిస్తారు. రాహు, చంద్రుల వీక్షణాలు అనుకూలత వల్ల శత్రువిజయం. ఆర్థికం.. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రుణభారం తొలగుతుంది. షేర్ల విక్రయాలు పూర్తయి కుటుంబం…సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. వివాహది శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. సంతానం ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. ఆరోగ్యం.. కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. అయితే వైద్యసేవలు పొంది ఉపసమనం పొందుతారు. వ్యాపారాలు…కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలు….విధుల్లో ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఉన్నతాధికారులు మీ సేవలను గుర్తిస్తారు. కళాకారులకు మరింత ఉత్సాహవంతమైన కాలం. మహిళలకు ఆస్తిలాభం. దేవీఖడ్గమాల పఠించండి.

మీనం: మీ అంచనాలు నిజం కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు కూడా మీపట్ల విధేయులుగా మారవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆర్థికం….ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మికంగా కొంత ధనప్రాప్తి ఉంటుంది. ఆస్తుల విక్రయాల ద్వారా మరింత సొమ్ము సమకూరుతుంది. కుటుంబం.. సంతానం, భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి. వివాహాది శుభకార్యాల ఎటువంటి ఆర్భాటం లేకుండా పూర్తి చేస్తారు. ఆరోగ్యం…క్రమేపీ మెరుగుపడుతుంది. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారాలు…తగినంత లాభాలు అందుతాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలు….రాహు, చంద్రుల వీక్షణాల వల్ల అనుకోని మార్పులు సంభవం. కొంత పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం చేకూరుతుంది. మహిళలకు స్వల్ప ధనలాభం. హనుమాన్ ఛాలీసా పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com