బేడీలు వేస్తేనే చినబాబు బైటకొస్తారా…?

జనమంతా రోడ్లపైకి రండి, అన్యాయాన్ని ఎదిరించండి, అక్రమాలను అడ్డుకోండి, అమరావతి కోసం పోరాటం చేయండి. ఇదీ చంద్రబాబు ఇచ్చిన పిలుపు. అందరి సంగతి సరే అసలు వారసుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. జనాన్ని పిలిచే…

జనమంతా రోడ్లపైకి రండి, అన్యాయాన్ని ఎదిరించండి, అక్రమాలను అడ్డుకోండి, అమరావతి కోసం పోరాటం చేయండి. ఇదీ చంద్రబాబు ఇచ్చిన పిలుపు. అందరి సంగతి సరే అసలు వారసుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. జనాన్ని పిలిచే ముందు తన పుత్రరత్నాన్ని జనంలోకి వదలరా? ఈ చిన్న లాజిక్ చంద్రబాబు ఎందుకు మర్చిపోయారు.

నిజంగానే లోకేష్ లో నాయకత్వ లక్షణాలే ఉంటే, తాము నమ్మిన రాజధానిని కాపాడుకునేందుకు కచ్చితంగా బైటకొచ్చేవారే. అరెస్ట్ అవుతారో, లాఠీ దెబ్బలు తింటారో, కొడతారో, కొట్టించుకుంటారో.. ఈ విషయాల్ని పక్కనపెడితే, నాయకుడు తమకు అండగా ఉన్నాడన్న భరోసా అయినా ప్రజలకు కల్పించాలి కదా.

వయసుపైబడి.. మరీ పదేళ్లు మాత్రమే బతుకుతాననే ఆశ ఉన్న చంద్రబాబును పక్కనపెడతాం, ఎంతో “భవిష్యత్” ఉందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్న లోకేష్ ఏం చేస్తున్నట్టు? ఎక్కడున్నాడో తెలియదు కానీ లోకేష్ మాత్రం ఆవేశపూరితమైన ట్వీట్స్ పెడుతూ కాలం గడుపుతున్నారు. పుట్టినరోజులకి శుభాకాంక్షలు, మరణాలకు సంతాపాలు తెలుపుతూ ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫీలవుతున్నారు.

ఇటీవల కాలంలో లోకేష్ బైటకొచ్చారంటే.. అది కచ్చితంగా టీడీపీ నేతలు అరెస్ట్ అయిన సందర్భాల్లోనే. రాయలసీమ వెళ్లి జేసీ ఫ్యామిలీని పరామర్శించి శుష్టుగా భోంచేసి వచ్చారు చినబాబు, ఇటు అచ్చెన్న కుటుంబానికి భరోసా కల్పించడానికి వెళ్లి ఉత్తరాంధ్ర రుచుల్నీ చవి చూశారు. మళ్లీ ఆయన బైటకు రావాలంటే ఇంకెవరైనా నాయకుడికి బేడీలు పడాలేమో అనుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.

ప్రజల సమస్యల కోసం ప్రాణాలిస్తాం, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే అంతు చూస్తామంటూ డైలాగులు కొట్టే లోకేష్.. వాస్తవంలో ఉత్తర కుమారుడు అనిపించుకుంటున్నారు. కనీసం అమరావతికోసమైనా లోకేష్ ని బైటకు పంపించవయ్యా చంద్రబాబూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి నేతలు బైటకొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారే కానీ, భావి నాయకుడిగా టీడీపీ భావిస్తున్న చినబాబు మాత్రం కాలు బైటపట్టడంలేదు, అదే విచిత్రం.

కరోనా తగ్గిపోయింది

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు