అమ్మాయి ప్రేమ కోసం స్నేహితుడితో గొడ‌వ‌ప‌డ్డ యువ‌హీరో

నేడు స్నేహితుల దినం. స్నేహానికి యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రాణ‌మిస్తాడు. స్నేహ‌మేరా జీవితం…స్నేహ‌మేరా శాశ్వ‌తం అని ఓ క‌వి అన్న దాన్ని సాయితేజ్ కూడా న‌మ్ముతాడు. దాన్నే ఆచ‌రిస్తాడు. స్నేహం గొప్ప‌ద‌నం…

నేడు స్నేహితుల దినం. స్నేహానికి యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రాణ‌మిస్తాడు. స్నేహ‌మేరా జీవితం…స్నేహ‌మేరా శాశ్వ‌తం అని ఓ క‌వి అన్న దాన్ని సాయితేజ్ కూడా న‌మ్ముతాడు. దాన్నే ఆచ‌రిస్తాడు. స్నేహం గొప్ప‌ద‌నం గురించి ఆయ‌న మాట‌ల్లో … ‘కష్టాన్నైనా, కన్నీళ్లనైనా వన్‌ బై టు చాయ్‌లాగా పంచుకునేవాడే స్నేహితుడు. ఓటమి ఎదురైనా సరే… ‘ఏం పర్లేదు, నువ్వు సాధిస్తావు’ అంటూ వెన్నుతట్టి వెనక నిలిచేవాడే నిజ‌మైన‌ స్నేహితుడు. అలాంటి స్నేహాలు నా జీవితంలో కూడా ఉన్నాయి’ అని  సాయి తేజ్ ఎంతో ధీమాగా చెబుతాడు.

‘చిత్రలహరి’ సినిమా ఇచ్చిన హిట్‌తో హీరోగా గుర్తింపు పొందాడు. ఆ త‌ర్వాత‌ ‘ప్రతి రోజూ పండగే’ చాన్స్ ద‌క్కించుకున్నాడు. అది షూటింగ్‌లో ఉండ‌గానే  ‘సోలో బతుకే సో బెటర్’ అనే సినిమా అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది. లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో  త్వ‌ర‌లో షూటింగ్ ఎపిసోడ్‌కు తెర‌ప‌డ‌నుంది.  స్నేహితుల దినోత్స‌వంగా సంద‌ర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు.

త‌న జీవితం ఎక్కువ‌గా స్నేహితుల మ‌ధ్య గ‌డిచిపోతుంటుంద‌ని చెప్పాడు. నీడ‌లా మ‌న‌వెంటే ఉండే ఒక ధైర్య‌మే స్నేహ‌మంటే అని సాయి ధ‌ర‌మ్ తేజ్ గొప్ప నిర్వ‌చ‌నం చెప్పాడు. న‌టుడు న‌రేష్ కుమారుడు న‌వీన్ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. తామిద్ద‌రూ త‌ర‌చూ మాట్లాడుకుంటూ ఉంటామ‌న్నాడు. అలాగే ఇంట‌ర్ చ‌దివేట‌ప్ప‌డు ఐదుగురు క‌లిసి ఒక బ్యాచ్ స్నేహంగా ఉండేవాళ్ల‌మ‌న్నాడు. స్ర‌వంత్‌, దినేష్‌, శ్ర‌వ‌ణ్‌, ఫ‌ణి…త‌న‌తో క‌లిసి ఐదుగుర‌మ‌ని చెప్పుకొచ్చాడు. వీరిలో ఇద్ద‌రు ఇప్పుడు అమెరికాలో ఉంటున్న‌ట్టు తెలిపాడు.

త‌న‌ జీవితంపై స్నేహం ప్రభావం చాలా ఉంటుంద‌న్నాడు. స్నేహం పేరుతో ఒక చేయి మన భుజంపై పడితే వాళ్ల విషయంలో మనమూ అంతే నమ్మకంగా, నిజాయతీగా ఉండాల‌న్నాడు. అప్పుడే ఆ బంధం శాశ్వ‌తంగా నిలుస్తుందని యంగ్ హీరో చెప్పుకొచ్చాడు.

సెప్టెంబరులో తిరిగి కెమెరా ముందు నిల‌బ‌డ‌తాన‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పాడు.  తాను చేస్తున్న ‘సోలో బ‌తుకే సో బెటరూ’ విష‌యానికి వ‌స్తే…ఒక వారం రోజులు పనిచేస్తే పూర్త‌వుతుంద‌ని తెలిపాడు.   మంచి కథ వ‌స్తే వెబ్‌సిరీస్‌లో చేయ‌డానికి అభ్యంత‌రం లేద‌ని చెప్పాడు. అన్నిటికంటే త‌న‌కు కథే ముఖ్యమ‌న్నాడు.  

కాలేజీ రోజుల్లో  ‘ప్రేమదేశం’ సినిమా తరహాలో ఒక నాట‌కీయ అనుభ‌వం తాను ఎదుర్కొన్న‌ట్టు సాయి ధ‌ర‌మ్ తేజ్ చెప్పాడు. త‌న‌కు, త‌న స్నేహితుడికి  ఓ అమ్మాయితో పరిచయం పెరిగింద‌న్నాడు. తామిద్ద‌రూ  ఒకరికి తెలియకుండా మరొకరు ఆ అమ్మా యిని ప్రేమించామ‌న్నాడు. ఆ త‌ర్వాత కొంత కాలానికి తాము ప్రేమిస్తున్న అమ్మాయి కాలేజీ విడిచి వెళ్లిపోయింద‌న్నాడు. కానీ ఆమె లేని లోటు త‌మ‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నాడు.

ఆ బాధ ఇద్ద‌రిలో క‌నిపించింద‌న్నాడు. దీంతో  ‘అస‌లు బాధ ఎందుకు? ఏమైంది’ అని ప‌ర‌స్ప‌రం ఓదార్చుకుంటూ ప్ర‌శ్నించుకున్నామ‌న్నాడు. అప్పుడు  ఆ అమ్మాయినే ఇద్ద‌రం ప్రేమిస్తున్నామ‌న్న వాస్త‌వం బ‌య‌టికి వ‌చ్చింద‌న్నాడు.

దీంతో తామిద్ద‌రం ‘ముందు నువ్వెందుకు చెప్పలేదు అని నేను… నువ్వెందుకు చెప్పలేదు అని వాడు ’ అని అభిమానంతో కూడిన వాద‌న‌తో గొడవకు దిగిన‌ట్టు చెప్పాడు. అనంత‌ర కాలంలో త‌మ మ‌ధ్య  అనుబంధం మరింత బలప‌డింద‌న్నాడు. ప్రేమ కోసం స్నేహితుడితో స‌ర‌దాగా దెబ్బ‌లాడిన కాలేజీ రోజులు గుర్తుకొస్తే ఎంతో గ‌మ్మ‌త్తుగా ఉంటుంద‌ని యంగ్ హీరో చెప్పుకొచ్చాడు.

కరోనా తగ్గిపోయింది

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు