విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఖుషి సినిమా చేశారు. 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. దీనికి సంబంధించి ఈ జంట ఆల్రెడీ ప్రమోషన్ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండకు చెందిన కొన్ని విషయాల్ని బయటపెట్టింది సమంత.
సినిమాల్లో కనిపించే విజయ్ దేవరకొండకు, అతడి బయట వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందంటోంది సమంత. తొలిసారి విజయ్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్, రియల్ లైఫ్ లో అతడ్ని చూసి ఆశ్చర్యానికి గురైందంట.
“విజయ్ దేవరకొండను అంతా రెబల్ అనుకుంటారు. నేను కూడా అలానే అనుకునేదాన్ని. సెట్స్ లో చూసిన తర్వాత విజయ్ ఏంటో అర్థమైంది. అతడికి ఎలాంటి దురలవాట్లు లేవు. ప్రతి రోజు జిమ్ చేస్తాడు. చాలా క్రమశిక్షణగా ఉంటాడు. తన సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తాడు. విజయ్ కు ఒక్క చెడు అలవాటు కూడా లేదని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాను.”
పార్టీలకు వచ్చినప్పుడు కూడా విజయ్ డ్రింక్ చేయడంట. ఓ వైన్ గ్లాస్ మాత్రం పట్టుకుంటాడట, పార్టీలో ఎన్ని గంటలు గడిపినా, ఆ వైన్ గ్లాస్ మాత్రం అలానే ఉంటుందట. విజయ్ చాలా సాఫ్ట్ గా ఉంటాడని చెబుతోంది సమంత.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పెళ్లిపై కూడా రియాక్ట్ అయింది సమంత. తను 2-3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని పైకి చెబుతుంటాడని, కానీ ఈ ఏడాదిలోనే అతడు పెళ్లి చేసుకుంటాడని తనకు అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చింది. పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యాడు. కొన్ని ప్రాక్టికల్ కారణాల వల్ల తనకు పెళ్లిపై మంచి ఒపీనియన్ కలిగిందని చెబుతున్నాడు.