ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరాలనే కసితో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుప్పంలో గత ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు మెజారిటీని తగ్గించి వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వచ్చే సారి చంద్రబాబును ఓడించి, బహుశా ఆయనకు ఆఖరి ఎన్నికల్లో ఓటమితో సెండాఫ్ ఇవ్వాలనే ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
పచ్చముఠా ప్రచారమే కానీ కుప్పంలో అయితే తెలుగుదేశం పార్టీకి అంత అనుకూలత కనిపించడం లేదు. ఈ విషయం చంద్రబాబు కూడా గ్రహించారు. అందుకే తరచూ కుప్పం పర్యటనలు పెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ.. ఏనాడూ కుప్పం వైపు చూడని చంద్రబాబు గత కొన్నాళ్లుగా కుప్పం చుట్టూ తిరుగుతున్నారు!
గతంలో ప్రచారానికి కూడా వెళ్లని చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో కనిపిస్తూ అటెండెన్స్ వేయించుకుంటున్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేయడం లేదు. కుప్పంలో చాపకింద నీరులా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది.
ఇక కుప్పం ఇన్ చార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కూడా కొనసాగించింది. ఈ బాధ్యతల్లో ఒక టర్మ్ పూర్తి చేసుకున్న భరత్ కు మరో అవకాశం కూడా ఇచ్చారు జగన్. తద్వారా చంద్రబాబు ప్రత్యర్థిపై పూర్తి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఇప్పటి వరకూ కుప్పంలో చూపించిన దూకుడును కొనసాగిస్తూ చంద్రబాబు కు చివరి ఎన్నికల్లాంటి వచ్చేసారి ఆయనను ఓడించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. ఇక చంద్రబాబు వైపు నుంచి బీరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయన వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం గట్టిగా పని చేయాలని, ఆ తర్వాతి ఎన్నికల్లో మీకే టికెట్ అంటూ కొంతమంది నేతలకు హామీ ఇచ్చారనే ప్రచారమూజరుగుతోంది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఆఖరి నిమిషంలో యూ టర్న్ తీసుకున్నా తీసుకోవచ్చు అనే మాటకూ ఆస్కారం ఉందిక్కడ!
కుప్పంలో పోటీ చేసి ప్రయోగం చేయడం కన్నా.. వేరే నియోజకవర్గంలో పోటీ చేయడమే సేఫ్ అనే లెక్కలు చంద్రబాబు వేయడంలో ఆశ్చర్యం లేదు. పచ్చమీడియా, పచ్చముఠాలు ప్రచారం చేసుకుంటున్న రీతిలో ఏమీ లేదు గ్రౌండ్ లెవల్ పరిస్థితి. ఇది గ్రహించి చంద్రబాబు కుప్పంలో కాకుండా కమ్మ వాళ్ల జనాభా ప్రభావితం చేసే సీట్లో పోటీ చేయడమో లేక, కుప్పంతో పాటు మరో చోట కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయనే విశ్లేషణ ఇప్పుడు వినిపిస్తోంది.
కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన తరహాలో చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి!