మరో జంట చిర్రుబుర్రులు

టాలీవుడ్ లో కావచ్చు, బయట కావచ్చు. ఈ మధ్యన వివాదాలు లేని జంటలు కనిపించడం అరుదు అవుతోంది. భావాలు కలవకపోవడం, స్వేచ్ఛ, ఇంకా చాలా చాలా విషయాల్లో ఒకటిగా వుండలేకపోతున్నారు. దీంతో నిత్య జీవితంలో…

టాలీవుడ్ లో కావచ్చు, బయట కావచ్చు. ఈ మధ్యన వివాదాలు లేని జంటలు కనిపించడం అరుదు అవుతోంది. భావాలు కలవకపోవడం, స్వేచ్ఛ, ఇంకా చాలా చాలా విషయాల్లో ఒకటిగా వుండలేకపోతున్నారు. దీంతో నిత్య జీవితంలో చిర్రుబుర్రులు తప్పడం లేదు. 

హీరో చైతన్య..హీరోయిన్ సమంత వ్యవహారమే ఇటీవలి ఉదాహరణ. పెద్దగా గుర్తింపు రాని, లేని ఓ చిన్న హీరో కూడా భార్యతో తరచు గొడవలు పడుతున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే గొడవ ఇతని వైపు నుంచా? ఆమె వైపు నుంచా అన్నది తెలియదు. 

హీరోకి పెద్దగా అయిడెంటిటీ లేకున్నా, ఆమె కాస్త పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. కానీ అవేమీ పెద్దగా పైకి పొక్కడం లేదు .

ప్రస్తుతం ఆ హీరో సినిమాలు రెండు ప్రొడక్షన్ లో వున్నాయి. ఈ చిర్రుబుర్రుల కారణంగా ఆ రెండు సినిమాల షూటింగ్ లు మెల్లగా సాగుతున్నాయని బోగట్టా. గత కొంత కాలంగా ఈ హీరో కూడా బయట కనిపించడం చాలా తక్కువగా వుంది.