కొత్త ఏడాది కానుక.. కుర్రాళ్లకు కండోమ్స్ ఫ్రీ

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. 31 రాత్రి పార్టీ కోసం ప్రపంచంలోని కుర్రాళ్లంతా ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంటే ముందే తమ దేశంలోని కుర్రాళ్లకు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. Advertisement 18…

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. 31 రాత్రి పార్టీ కోసం ప్రపంచంలోని కుర్రాళ్లంతా ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంటే ముందే తమ దేశంలోని కుర్రాళ్లకు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది ఫ్రాన్స్ ప్రభుత్వం.

18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న కుర్రాళ్లకు దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపుల్లో కండోమ్స్ ఉచితంగా అందించబోతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది.

ఫ్రాన్స్ లో ఇటీవల కాలంలో అవాంఛిత గర్భాలు ఎక్కువయ్యాయి. దీంతో అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతింటోంది. అంతేకాకుండా, 2020, 2021లో దేశంలో లైంగిక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య 30శాతం పెరిగింది.

దేశంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు గర్భనిరోధక పద్ధతుల్ని పాటించడం మానేశారు. ఈ నివేదికలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత, వయసులో ఉన్న కుర్రాళ్లకు కండోమ్స్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది ఫ్రెంచ్ ప్రభుత్వం.

తొలిసారిగా 1998లో కండోమ్స్ ప్రచారం కోసం నీలిచిత్రాల్ని వాడడం మొదలుపెట్టింది ఫ్రాన్స్. యువత కండోమ్స్ వాడకం వైపు మరింత ఎక్కువగా మొగ్గుచూపేందుకు, 5 నుంచి 8 నిమిషాల నిడివి కలిగిన పోర్న్ ను అధికారికంగా వాడింది. అయితే ఆ తర్వాత దేశంలో చోటుచేసుకున్న ఆర్థిక సంస్కరణల వల్ల ధరలు పెరిగి, కండోమ్స్ వాడకం తగ్గింది. 

మళ్లీ ఇన్నేళ్లకు కండోమ్స్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇలా ఉచిత పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ దేశ ప్రభుత్వం.