ఎవరికి ఏ సమాచారం కావాలన్నా గూగుల్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. చివరికి కామన్ సెన్స్ తో ఆలోచించే విషయాల్ని కూడా గూగుల్ లో కొట్టడం అలవాటుగా మారిపోయింది. ఇలా ఏటా కోట్లలో గూగుల్ సెర్చ్ పదాల్ని క్రోడీకరిస్తోంది ఆ సంస్థ.
2022లో కూడా ఇలాంటి సెర్చ్ పదాలు చాలానే పోగుపడ్డాయి. వాటిలోంచి టాప్-10 ను వెలికితీసింది గూగుల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది గూగుల్ హోమ్ పేజీలో సెర్చ్ కొట్టిన పదం WORDLE. ఈ పదానికే ఎక్కువ సెర్చ్ లు వచ్చాయి.
వర్డెల్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన భార్యకు కాలక్షేపం కోసం కనిబెట్టిన గేమ్ ఇది. కొన్ని నెలల పాటు ఈ గేమ్ ను ఆమె ఆడింది. ఆ తర్వాత తన బంధువులకు కొంతమందికి వాట్సాప్ ద్వారా ఈ గేమ్ పంపించాడు వార్డెల్. అది కాస్తా వైరల్ అయిపోయింది.
దీంతో 2021 అక్టోబర్ లో తన పేరు మీదనే ఈ గేమ్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాడు వర్డెల్. ఇది చాలా సింపుల్ గేమ్. ఇంకా చెప్పాలంటే తెలుగులో పదవినోదం లాంటిది. సరైన పదం కనిబెట్టడానికి ఇందులో 6 ఛాన్సులుంటాయి.
ఇక ఇండియా నుంచి ఎక్కువమంది క్రికెట్, ఫుట్ బాల్ కు సంబంధించి గూగుల్ లో ఎక్కువగా వెదికారు. క్రీడల తర్వాత సినిమాలు, లోకల్ న్యూస్, టెక్నాలజీ, ఫైనాన్స్ అంశాలకు సంబంధించి భారతీయులు ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేశారంట.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది సెర్ట్ చేసిన టాప్-10 పదాలివే..
1. Wordle, 2. India vs England, 3. Ukraine, 4. Queen Elizabeth, 5. Ind vs SA, 6. World Cup, 7. India vs West Indies, 8. iPhone 14, 9. Jeffrey Dahmer, 10. Indian Premier League