కళా వంతు కూడా పూర్తి అయిందా…?

ఒకే ఒక్క మీటింగ్ మీద తెలుగుదేశం పార్టీ రోజుల తరబడి గొంతు చించుకుంటోంది అంటే అర్ధమేంటి. ఆ మీటింగ్ సూపర్ హిట్టే అని కదా. అదే జయహో బీసీ. వైసీపీ ఆధ్వర్యాన ఈ నెల…

ఒకే ఒక్క మీటింగ్ మీద తెలుగుదేశం పార్టీ రోజుల తరబడి గొంతు చించుకుంటోంది అంటే అర్ధమేంటి. ఆ మీటింగ్ సూపర్ హిట్టే అని కదా. అదే జయహో బీసీ. వైసీపీ ఆధ్వర్యాన ఈ నెల 7న విజయవాడ నడిబొడ్డున జరిగిన ఈ సభ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ అయితే ఎన్నడూ లేని విధంగా రెండు గంటల పాటు సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చి బీసీలు నా వాళ్ళు అని గట్టిగా చెప్పుకుని టీడీపీకి తీరని దిగులు మిగిల్చారు.

అంతే చంద్రబాబు నుంచి గల్లీ స్థాయి తమ్ముళ్ళ వరకూ అందరూ కూడా బీసీ పేరెత్తే అర్హత వైసీపీకి లేదు అంటూ పెద్ద నోరు చేసుకుంటున్నారు. బీసీల మీద అన్ని రైట్స్ మావి మాదే అసలైన బీసీల పార్టీ అని మాట్లాడుతున్నారు.

ఏ ముహూర్తాన బీసీ సభ అని వైసీపీ ప్రకటించిందో కానీ నాటి నుంచే ఇదే విధంగా టీడీపీ గగ్గోలు పెడుతోంది. ఇలా అందరూ అయిపోయాక తన వంతు వచ్చిందని అనుకున్నారేమో ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు జగన్ని పట్టుకుని బీసీ ద్రోహి అంటూ పెద్ద విమర్శలే చేశారు.

బీసీలను వంచించిన సీఎం గా జగన్ చరిత్రలో నిలిచిపోతారుట. ఆయన ఏమన్నా బీసీల తోక కట్ చేస్తానని అన్నారా. వారి మీద గయ్యిమని విరుచుకుపడ్డారా. ఏమన్నారని బీసీ ద్రోహి అని అంటున్నారు కళా గారూ అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇపుడు టీడీపీకి బీసీ బీపీ పట్టుకుంది. దాంతో ఒకరి తరువాత ఒకరు వైసీపీని తిట్టిపోస్తున్నారు. ఇపుడు కళా వంతు అని సర్దుకుంటే సరిపోతుందేమో.