చంకలో మేక పిల్ల.. చేతిలో గొడ్డలి

వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఇన్నాళ్లూ చిరంజీవి లుక్స్, స్టెప్స్ చూశాం. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ ప్రీ లుక్ …

వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఇన్నాళ్లూ చిరంజీవి లుక్స్, స్టెప్స్ చూశాం. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ ప్రీ లుక్  రివీల్ చేశారు. చంకలో మేకపిల్ల, చేతిలో గొడ్డలితో రవితేజ నడుస్తున్న లుక్ ను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు.

వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడనే విషయం తెలిసిందే. దాన్ని నిజం చేస్తూ ఈరోజు యాక్షన్ లుక్ లో ఉన్న రవితేజ స్టిల్ ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించాడు.

ఇది ప్రీ లుక్ కాబట్టి చంకలో ఉన్నది మేక పిల్లనా లేక కోడి పెట్టనా అనేది అర్థం కాకుండా ఉంది. రవితేజ ముఖం కూడా స్పష్టంగా కనిపించలేదు. కాకపోతే రవితేజతో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనే విషయాన్ని మాత్రం పోస్టర్ తో స్పష్టంగా చెప్పగలిగారు. పూర్తిస్థాయిలో రవితేజను చూడాలంటే 12వ తేదీ వరకు ఆగాల్సిందే.

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం యూరోప్ లో చిరంజీవి, శృతిహాసన్ మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు.