ఇపుడేమంటారు బాబాయ్..?

తరం తరం నిరంతరం అంటారు. కొత్త నీరు వస్తే పాత నీరు పక్కకు తొలగాల్సిందే. ఇక పూసపాటి వారి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం …

తరం తరం నిరంతరం అంటారు. కొత్త నీరు వస్తే పాత నీరు పక్కకు తొలగాల్సిందే. ఇక పూసపాటి వారి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం  బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు.

ఆమె ఆ పదవికి పనికిరాదు, అనర్హురాలు అన్నారు. ఇపుడు అదే అమ్మాయి 53 కోట్ల రూపాయల కేంద్ర నిధులను తీసుకువచ్చింది. దాంతో వరల్డ్ నంబర్ వన్ టెంపుల్ గా సింహాచలాన్ని అభివ్రుధ్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

అంతే కాదు, ఆమె చైర్ పర్సన్ గా బాధ్యత తీసుకున్న తరువాత చేసిన క్రుషికి, ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కూడా కురిపించింది. ఈ నేపధ్యంలో ఇపుడేమంటారు బాబాయ్ అంటోంది సంచయిత. ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి  సీట్లో కూర్చోబెట్టారు అని ఇంతకాలం ఆడిపోసుకున్న వారు ఇకనైనా మౌనాన్ని ఆశ్రయిస్తారనుకుంటాను అంటూ ట్వీట్  చేస్తూ మరీ సంచయిత సెటైర్లు వేసింది.

కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు పనిచేశారు. అదే సమయంలో ఆయన సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ గా కూడా  ఉన్నారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిదేళ్ళ పాటు చక్రం తిప్పారు, బీజేపీతో దోస్తీ చేసి మరీ వారూ వీరూ ఒక్కటి అన్నారు. మరి ఆనాడు సింహాచలానికి కేంద్ర నిధులు ఎందుకు తేలేకపోయారు అంటూ సంచయిత లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

ఇక మీరు గమ్మునుండండి అన్నట్లుగా సంచయిత వేసిన ట్వీట్ ఆమె తొలి విజయాన్ని, ధీమాను తెలియచేస్తోంది. అందరి సహాయంతో సింహాచలాన్ని తన పదవీకాలంలో  పూర్తిగా అభివ్రుధ్ధి చేస్తామని సంచయిత అంటున్నారు. మొత్తానికి సీటు ఎక్కి ఆరు నెలలు కాకుండానే సంచయిత సంచలనమే స్రుష్టించారు.