సానియా చెల్లెలు రెండో పెళ్లి, క్రికెటర్ కొడుకుతో!

సానియా మీర్జా చెల్లెల్లు అనమ్ మీర్జాకు పెళ్లి కుదరిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సానియా ధ్రువీకరించింది. అదెవరితోనో కాదు.. భారత మాజీ క్రికెటర్, తాజాగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అజర్ రుద్ధీన్…

సానియా మీర్జా చెల్లెల్లు అనమ్ మీర్జాకు పెళ్లి కుదరిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సానియా ధ్రువీకరించింది. అదెవరితోనో కాదు.. భారత మాజీ క్రికెటర్, తాజాగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అజర్ రుద్ధీన్ తనయుడు అసద్ తో అనమ్ పెళ్లి కుదిరిందని తెలుస్తోంది. ఇటీవలే సానియా కుటుంబ సభ్యులు పారిస్ లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారట. ఈ డిసెంబర్లో పెళ్లి అని సానియా ప్రకటించింది.

అజర్ తనయుడు అసద్ క్రికెటర్ గా కొనసాగే ప్రయత్నాల్లో ఉన్నాడు. గోవా రంజీ టీమ్ లోనేమో ఇతడికి చోటు దక్కినట్టుగా ఉంది. అయితే అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఐపీఎల్ ప్రయత్నాలు సాగిస్తున్నాడట. ఇక అనమ్ మీర్జాకు ఇదివరకే అక్బర్ రషీద్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందట. వీరు గత ఏడాది విడిపోయినట్టుగా తెలుస్తోంది.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!