పైత్యం ముదురుతోంది జనాలకు. ఒడ్డూపొడుగు ఉన్న అబ్బాయిలను చూడగానే, అది కూడా వారు సెలబ్రిటీలు అయితే కొంతమంది అమ్మాయిలు అడ్డగోలుగా మాట్లాడే సమయం వచ్చినట్టుగా ఉంది. అందులో భాగంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కు ఒక ఉచిత సలహా ఇచ్చింది ఒక అమ్మాయి. తమిళనాడుకు చెందిన భావన అనే మహిళా క్రికెటర్ హృతిక్ మీద అతి ప్రేమను ఒలకపోసింది.
ఇటీవలే వార్ సినిమాలో హృతిక్ ను చూసి తట్టుకోలేక ఈమె ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే.. హృతిక్ వీర్యదానం చేయాలట. తన జీన్స్ ను అలా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలట. ఇదీ ఈమె సలహా. హృతిక్ రోషన్ మీద ప్రేమ ముదిరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా ఉంది.
వార్ సినిమాలో తనబోటి అమ్మాయిలు హృతిక్ ను చూసి ముగ్దులయిపోయారని కూడా చెప్పుకొచ్చింది. ఆ పైత్యంలో స్పెర్మ్ డొనేషన్ చేయాలని ఆ హీరోకి సూచించేసింది. అయినా ఈ లేకి మాటలు ఎందుకో. హృతిక్ రోషన్ ఎంచక్కా పెళ్లి చేసుకున్నాడు. పిల్లలున్నారు. విడాకులు తీసుకున్నా.. వారు జంటగా సాగుతున్నారు. ఇలాంటి మాటలతో కొంతమంది ప్రచారం పొందాలని భావిస్తారు కాబోలు.