నాగచైతన్య-సమంత జంట విడిపోవడంపై ఇంకా రచ్చ సాగుతూనే ఉంది. మోస్ట్ సెలబ్రిటీ జంట కావడంతో సహజంగానే ఇంకొంత కాలం పాటు వీరి ఎడబాటుపై కామెంట్స్ వెల్లువెత్తుతూనే ఉంటాయి.
విడిపోయిన ప్రకటన తర్వాత నాగచైతన్య స్పందిస్తూ … ఇప్పుడు హాయిగా ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా సమంత తనదైన రీతిలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సూటిగా సమాజానికి ఓ ప్రశ్న సంధించారు.
ఈ ప్రశ్న ఆమెలో గూడు కట్టుకున్న ఆవేదన, ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ జంట విడిపోతే… తప్పంతా మహిళదే అన్నట్టు సమాజం వేలెత్తి చూపడాన్ని సమంత తన ప్రశ్నతో నిరసించిందని అంటున్నారు. ఇంతకూ ఆమె షేర్ చేసిన పోస్ట్ ఏంటంటే…
“మహిళలను ప్రశ్నిస్తూ ఉండే సమాజం, మగళవాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా” అని నిలదీయడం ప్రాధాన్యం సంతరిచుకుంది. సమంత ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు? ఏమని ఇస్తారు? ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగలకూడదు. ఎందుకంటే ఇలాంటివి పునరావృతం కాకూడదనే కోరుకునే వాళ్లు… సమాధానం కావాలని ఆశించడంలో తప్పు లేదు కాబట్టి.