సిద్ధు జొన్నలగడ్డ శాటిస్ఫై అవ్వడం లేదు. ఇప్పటికి ముగ్గురు హీరోయిన్లను మార్చేశాడు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ వెంట పడుతున్నాడు. ఇదంతా అతడి టిల్లూ స్క్వేర్ సినిమా కోసం మాత్రమే.
డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది టిల్లూ స్క్వేర్ మూవీ. ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమెను తప్పించారు. ఆ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు.
అనుపమతో కూడా కొన్ని రోజులు బండి లాగించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమెను కూడా తప్పించారు. ఆ స్థానంలో మడొన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారు.
మడొన్నా సెబాస్టియన్ పేరు తెరపైకొచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఆమె కూడా ఔట్ అనే టాక్ వినిపిస్తోంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.
రీసెంట్ గా హిట్-2తో హిట్ కొట్టింది మీనాక్షి చౌదరి. ఆమె గోల్డెన్ హ్యాండ్ టిల్లూకు కలిసొస్తుందని భావిస్తున్నాడు సిద్ధూ. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయాధికారం దాదాపు సిద్ధూదే. ఎందుకంటే, కథ-దర్శకుడు నుంచి చాలా విషయాల్లో సిద్ధూకు నిర్మాత నాగవంశీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు.