Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా..నందమూరి ఫ్యాన్స్ కార్యాలోచన?

మెగా..నందమూరి ఫ్యాన్స్ కార్యాలోచన?

సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను కాదని తమిళ హీరో విజయ్ సినిమాలకు ఎక్కువగా కానీ, కీలకమైన థియేటర్లు కానీ కేటాయిస్తే ఏం చేయాలి? దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ప్రతిఘటించాలి? అనే దాని మీద సమాలోచనలు తెరవెనుక ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

సంక్రాంతి సినిమాలు, థియేటర్ల కేటాయింపు మీద అగ్రహీరోలు ఏమీ పెదవి విప్పడం లేదు. కానీ వారి దృష్టిలో ఈ సమస్య లేకపోలేదు. రీసెంట్ గా జరిగిన అన్ స్టాపబుల్ షో లో ‘నా సినిమాకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు’ అని బాలయ్య నేరుగా అల్లు అరవింద్ ను అడగడం విశేషం. నిజానికి అడగాల్సింది దిల్ రాజు అండ్ కో ను. కానీ ఆయన షో లో లేరు.

మెగా ఫ్యాన్స్ ఇప్పటికే తమ బాస్ సినిమాకు అన్యాయం జరుగుతోందని కిందా మీదా అవుతున్నారు. సరైన డేట్ దొరకడం లేదని ఫీలవుతున్నారు. రాయలసీమ, ఆంధ్రలో ఎగ్జిబిటర్లు తమకు వీరసింహా రెడ్డి కావాలని, వాల్తేర్ వీరయ్య వేయాలని డిమాండ్ చేస్తున్న వైనాలు వున్నాయి. కానీ ముందుగానే వారసుడు సినిమాకు చాలా వరకు అగ్రిమెంట్ లు చేసారు. ఈ విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు.

సినిమా రంగం తరపున తప్పు లేకుండా ఇప్పటికే ఒకటికి రెండు సార్లు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానాలు చేసి ఆదేశాలు పంపారు. దీని వెనుక ముందు జాగ్రత్త వ్యూహం వుందని టాక్ వినిపిస్తోంది. రేపు ఫ్యాన్స్ ఆగ్రహించి థియేటర్ల మీదకు వస్తే, తాము ముందే చెప్పామని చెప్పుకోవడానికి వుంటుందని ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది.

సింగిల్ స్క్రీన్ లు, డబుల్ స్క్రీన్ లు వున్న దగ్గర తెలుగు హీరోలకు ఇవ్వకుండా వారసుడు సినిమాకు స్క్రీన్ లు ఇస్తే ఫ్యాన్స్ కాస్త తీవ్రంగా రియాక్ట్ అయ్యే ప్రమాదం వుందని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది. అప్పుడు నష్టపోయేది దిల్ రాజు అండ్ కో కాదని, ఎగ్జిబిటర్లే అని కామెంట్ల వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ సమావేశాలు, డిస్కషన్లు సాగుతున్నాయని, ఇవి ఏ దిశగా వెళ్తాయన్నది చూడాల్సి వుందని తెలుస్తోంది. 

ముఖ్యంగా సీమ, ఆంధ్రలో ఈసారి మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ గట్టిగానే పట్టుకుంటారు. అనవసరపు రాజకీయాలు చేసి థియేటర్లు లేకుండా చేస్తే కాస్త ఇబ్బందే అవుతుంది అని ఇండస్ట్రీలో కీలక వ్యక్తి ఒకరు అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?