వారాహి కర్టెసీ..త్రివిక్రమ్!

పవన్ కళ్యాణ్ కు వున్న ఫాంటసీ కి ప్రతిబింబం లా ఆయన ఎన్నికల ప్రచార వాహనం రెడీ అయింది. మిలటరీ ట్రక్ స్టయిల్, మిలటరీ ఆలివ్ గ్రీన్ కలర్, ఇవి చాలక రిటైర్డ్ ఆర్మీ…

పవన్ కళ్యాణ్ కు వున్న ఫాంటసీ కి ప్రతిబింబం లా ఆయన ఎన్నికల ప్రచార వాహనం రెడీ అయింది. మిలటరీ ట్రక్ స్టయిల్, మిలటరీ ఆలివ్ గ్రీన్ కలర్, ఇవి చాలక రిటైర్డ్ ఆర్మీ సైనికులను గార్డ్ లుగా రిక్రూట్ చేసుకోవడం అన్నీ చేసి మొత్తానికి ఓ మిలటరీ కవాతు కలర్ తీసుకువచ్చారు. ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు.

వారాహి అన్నది అమ్మవారి పేరు అని చాలా మందికి తెలిసిందే. శక్తి మాత అయిన వారాహి రూపంలో అమ్మవారిని కొలవడం అన్నది చాలా తక్కువ మందే చేస్తారు. ఇటీవలి కాలంలో వారాహి మాత పూజలు అన్నవి కాస్త పాపులర్ అయ్యాయి. 

పవన్ తన ఎన్నికల వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక దర్శకుడు త్రివిక్రమ్ వున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. మిత్రుడు కోరిక మేరకు ఈ టైటిల్ ను త్రివిక్రమ్ పెట్టారని టాక్.

పవన్ కు ఆధ్యాత్మిక విషయాల్లో అన్నింటా సలహాదారు త్రివిక్రమ్ నే. పవన్ కు త్రివిక్రమ్ ఉపనయనం చేసి, యజ్ఙోపవీతం కూడా వేసారని వార్తలు వున్నాయి. విజయసిద్దికి మూలమైన వారాహి పేరును ఎన్నికల పర్యటన వాహనానికి వుంచడం అన్నింటా సముచితంగా వుంటుందని త్రివిక్రమ్ భావించి, ఆ మేరకు సలహా ఇచ్చి వుంటారని భోగట్టా.