టాపిక్ ఏదైనా తనదైన శైలిలో విశ్లేషణ ఇవ్వడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. మరీ ముఖ్యంగా వివాదాస్పద అంశాల్ని కెలకడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ దర్శకుడికి ఇష్టం. తాజాగా ప్రేమికుల ఆలోచనలు, అభిరుచులపై పడ్డాడు ఆర్జీవీ. లవర్స్ ఎందుకు బ్రేకప్ అవుతారో వివరంగా చెప్పుకొచ్చాడు. ఎక్కువ మంది ప్రేమికులు బ్రేకప్ అవ్వడానికి కారణం సెక్స్ అంటున్నాడు ఈ దర్శకుడు.
“ప్రేమికుల మధ్య సెక్స్ ఇచ్చినంత తృప్తిని ప్రేమ అందించదు. వీడు కౌగిలించుకుంటాడు, అమ్మాయికి రకరకాల కబుర్లు చెబుతాడు. నువ్వు లేకపోతే నేను లేను అంటాడు. ఈ కబుర్లు అన్నీ ఎందుకు చెబుతాడంటే, ఫస్ట్ సెక్స్ కానిచ్చేయాలి. ఎప్పుడైతే ఆ సెక్స్ పూర్తయిపోతుందో, అబ్బాయి నుంచి మాటలు తగ్గిపోతాయి. ఇక్కడే అమ్మాయిలతో సమస్య వస్తుంది. అబ్బాయి చెప్పిన మాటల వల్ల సెక్స్ తర్వాత కూడా అమ్మాయిల ఎమోషన్స్ కంటిన్యూ అవుతాయి. కానీ కోరిక తీర్చుకున్న అబ్బాయి మాత్రం అమ్మాయిని అంటిపెట్టుకొని ఉండలేడు. ఎందుకంటే, అతడికి కావాల్సిన తృప్తి దొరికేసింది. అమ్మాయి వెంట పడి, తను చెప్పిన మాటల్నే పదేపదే గుర్తుచేస్తున్నప్పుడు అబ్బాయి ఒత్తిడికి లోనవుతాడు. ఆ ఒత్తిడి నుంచి అమ్మాయిపై వ్యతిరేకత బిల్డప్ అవుతుంది. అదే బ్రేకప్ కు ప్రధాన కారణం.”
ఇలా ప్రేమికులు విడిపోవడానికి తనదైన విశ్లేషణ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అషు రెడ్డితో చిట్ చాట్ చేస్తూ ఇలా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అషు రెడ్డి పాదాల దగ్గర కూర్చున్న వర్మ, అమ్మాయిల ముఖం కంటే తొడలు చూడ్డానికే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారని, అందుకే తను కూడా కాళ్ల దగ్గర కూర్చున్నానని అన్నాడు.
ఈ సందర్భంగా అషురెడ్డి పాదాలపై ముద్దు కూడా పెట్టాడు ఈ డైరక్టర్. దాదాపు గంటకు పైగా సాగిన ఈ ఇంటర్వ్యూపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఇంతకంటే దిగజారలేడంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. వర్మ మాత్రం ఎప్పట్లానే తనకు కావాల్సిన ప్రచారాన్ని దక్కించుకున్నాడు.