“నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు” అంటూ త్రివిక్రమ్ ఏకంగా పూజా హెగ్డే లెగ్స్ మీద ఓ పాటే వేసుకున్నాడు. అలా అని ఆయన కేవలం పాటతోనే ఆపలేదు. చాలా సన్నివేశాల్లో, సినిమాలోని మిగతా పాటల్లో ఎక్కడపడితే అక్కడ పూజా కాళ్లపైనే ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా త్రివిక్రమ్ దారిలోనే పడ్డాడు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించి “క్వారంటైన్ లైఫ్” అంటూ కొద్దిసేపటి కిందట ఓ లుక్ రిలీజ్ చేశారు. ఈ స్టిల్ చూసిన వెంటనే ఎవరికైనా ముందుగా ఫోకస్ మొత్తం పూజా హెగ్డే కాళ్ల మీదకే పోతుంది. ఏరికోరి బొమ్మరిల్లు భాస్కర్ ఈ లుక్ రిలీజ్ చేయడానికి, దానికి అల్లు అరవింద్ ఓకే అనడానికి రీజన్ ఏంటనేది కూడా ఈ స్టిల్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
అవును.. పూజా హెగ్డే మరోసారి తన పొడుగుకాళ్ల సోయగాన్ని ఈ సినిమాలో చూపించబోతోందనేది పక్కా. దానికి కర్టన్ రైజర్ లాంటిదే ఈ స్టిల్. పోస్టర్ లో అఖిల్ సీరియస్ గా ల్యాప్ టాప్ పట్టుకొని వర్క్ చేస్తుంటే.. వెనక నుంచి పూజా హెగ్డే తన కాళ్లతో హీరో చెవిని టచ్ చేసే సన్నివేశం చాలా రొమాంటిక్ గా సెక్సీగా ఉంది. పూజా లెగ్స్ ఈ పోస్టర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరోయిన్ల ఎస్సెట్స్ ను ఇలా క్లోజ్ గా చూపించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో రమ్యకృష్ణ నడుము పైనే దర్శకుల చూపు మొత్తం ఉండేది. ఆ తర్వాత ఇదే పద్ధతి ఇలియానా విషయంలో కూడా పాటించారు. భానుప్రియ, శ్రీదేవితో సినిమా తీసిన ఏ దర్శకుడు వాళ్ల కళ్లను మిస్ అవ్వలేదు. ఇక రంభను వెనక వైపు నుంచి చూపించని దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలా పూజా హెగ్డే కూడా ఇప్పుడు సెక్సీ లెగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నమాట.
చాన్నాళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.