పవన్ Vs పేర్ని.. కాపుల దృష్టిలో ‘సన్నాసి’ ఎవరు..?

పవన్ కల్యాణ్, పేర్ని నాని.. ఇద్దరూ కాపు నాయకులు. ఒకరు రాష్ట్రానికి మంత్రి. మరొకరు ఓ రాజకీయ పార్టీకి అధినేత. పార్టీ అధినేత అనే పదవే గొప్ప అయితే, గత ఎన్నికల్లో పవన్ కంటే…

పవన్ కల్యాణ్, పేర్ని నాని.. ఇద్దరూ కాపు నాయకులు. ఒకరు రాష్ట్రానికి మంత్రి. మరొకరు ఓ రాజకీయ పార్టీకి అధినేత. పార్టీ అధినేత అనే పదవే గొప్ప అయితే, గత ఎన్నికల్లో పవన్ కంటే ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టిన కేఏ పాల్ ని ఇంకా గొప్ప నేతగా అభివర్ణించాలి. 

సూటిగా చెప్పాలంటే ఎమ్మెల్యేగా గెలిచి, హెవీ కాంపిటీషన్లో కూడా మంత్రి పదవి సంపాదించారు పేర్ని నాని. ఎమ్మెల్యేగా రెండు స్థానాల్లో పోటీ చేసి మరీ ఓడిపోయారు పవన్. ఇంతవరకు ఇద్దరిలో ఎవరు గొప్పో అనే విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఉంది.

కానీ ఇటీవల పవన్, పేర్ని ఇద్దరూ కులం పేరిట తిట్టుకున్నారు. పేర్ని నానిని పవన్ సన్నాసి అన్నారు. పవన్ ను ఆయన వెధవన్నర వెధవ అంటూ బదులిచ్చారు. ఇద్దరూ గట్టిగా తిట్టుకున్నారు. ఈ క్రమంలో జగన్ కు తను పెద్ద పాలేరునని చెప్పుకున్నారు పేర్ని. 

చంద్రబాబుకి నువ్వు ఏమవుతావో, కాపుల కాళ్ల దగ్గర నీ స్థాయి ఏంటో చెప్పగలవా అంటూ సవాల్ విసిరారు. ఈ మొత్తం వ్యవహారంలో కాపుల దృష్టిలో బద్నామ్ అయిందెవరు? మైలేజీ పెంచుకున్నది ఎవరనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పవన్ చుట్టూ కులం కంపు

తను కులం చెప్పుకోనంటారు పవన్ కల్యాణ్. కానీ కాపు నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. ఓవైపు కాపుల కోసం పనిచేస్తానంటారు, మరోవైపు కమ్మోళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. ఇంకోవైపు మాదిగగా పుట్టనందుకు క్షమించండి అంటూ ఏవేవో స్టేట్ మెంట్స్ ఇస్తారు. 

మొత్తమ్మీద తననుతాను అందరివాడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూనే కాపు నాయకుడిగా ఎదిగేందుకు మాత్రం పవన్ తహతహలాడుతున్నారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికలనాటికి కాపు రాజకీయమే ఆయనకు శ్రీరామరక్ష అనుకుంటున్నారు.

బయటకు కులం లేదు అని చెప్పుకుని, లోపల కులహంకారాన్ని నింపుకున్నందుకు 2019 ఎన్నికల్లో న్యాయం జరగలేదు. ఇప్పుడు నేరుగా కులం రంగుని ఒంటినిండా పులుముకుని రంగంలోకి దిగాబోతున్నారు పవన్. ఈసారి నిజంగా ఆయన కాపు నాయకుడు అవుతారేమో చూడాలి.

తన కులంలో పేర్ని నాని పరిస్థితేంటి?

పేర్ని నానికి ఇలా కిందా మీద పడాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ కాపుల్లో ఓ ఇమేజ్ ఉంది. కానీ కాపు నాయకుడ్ని అని చెప్పుకుని ఎక్కడా ఆయన ఓటు అడగలేదు. అందరివాడుగానే ఆయన్ని నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. ఆ ఇమేజ్ కి తోడుగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కలిసొస్తున్నాయి. 

పవన్ పై విమర్శలు చేసే క్రమంలో పేర్నినాని కాస్త హద్దు దాటిన మాట వాస్తవం. కాపుల్లో కొంతమంది దృష్టిలో ఆయన పలుచన అయిన విషయం కూడా వాస్తవం. మరీ ముఖ్యంగా పాలేరు అనే పద ప్రయోగం కాపుల అహాన్ని దెబ్బకొట్టింది.

అయితే ఇవేవీ వచ్చే ఎన్నికల నాటికి పేర్నిపై పెద్దగా ప్రభావం చూపించవంటున్నారు విశ్లేషకులు. కాపుల అహం దెబ్బతిన్నా.. వారు కూడా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులే. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసాని అందుకుంటున్నవారే. అంటే కచ్చితంగా వారు అహాన్ని పక్కనపెట్టి అవసరాన్ని గుర్తించాల్సిందే.

సో.. వచ్చే ఎన్నికల్లో పవన్ కు కాపు మద్దతు ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ, పేర్ని నానికి ఆ సమస్య ఉండబోదు. ఎందుకంటే, పవన్ ఇప్పుడే కాపుజపం మొదలుపెట్టారు. పేర్ని నాని ఆల్రెడీ తానేంటో నిరూపించుకున్నారు.