మెగా హీరోల సినిమాల దారెటు?

చిరంజీవి.. పవన్ కళ్యాణ్ తరువాత తరం బన్నీ-చరణ్ అయితే ఆ తరువాత జనరేషన్ వరుణ్-సాయి ధరమ్- వైష్ణవ్. బన్నీ-చరణ్ తమ రేంజ్ పెంచుకుని చిరు-పవన్ ల స్థాయికి చేరుకున్నారు. దాదాపు దాటేస్తున్నారు కూడా. కానీ…

చిరంజీవి.. పవన్ కళ్యాణ్ తరువాత తరం బన్నీ-చరణ్ అయితే ఆ తరువాత జనరేషన్ వరుణ్-సాయి ధరమ్- వైష్ణవ్. బన్నీ-చరణ్ తమ రేంజ్ పెంచుకుని చిరు-పవన్ ల స్థాయికి చేరుకున్నారు. దాదాపు దాటేస్తున్నారు కూడా. కానీ ఈ జూనియర్లు ముగ్గురూ మాత్రం ఇంకా ఓ లెవెల్ లోనే ఆగిపోయారు. ఒక్కొక్కరు మెలమెల్లగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ సక్సెస్ మాత్రం ఎత్తుపల్లాలు చూపిస్తోంది.

వరుణ్ తేజ్ సక్సెస్ కొట్టి చాలా కాలం అయింది ఫిదా, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ మంచి సక్సెస్ లు. ఎఫ్ 3 ఓకె. ఇక ఫ్లాపులు సంగతి సరే, ఈ ఏడాది వచ్చిన గాండీవధారి అర్జున, లాస్ట్ ఇయర్ లో వచ్చిన గని డిజాస్టర్ లు. ఇప్పుడు వస్తుందనుకుని, వాయిదా పడిన ఆపరేషన్ వాలంటైన్ కు అస్సలు బజ్ నే లేదు. ఇప్పుడు వాయిదా పడితే మరి ఆ సినిమాకు మళ్లీ డేట్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. దాని తరువాత ఒక్క సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. కానీ దాని నిర్మాతలు వేరే సినిమా గడబిడలో బిజీగా వున్నారు. దీని గురించి ఇప్పుడే ఆలోచించే తీరుబాటు లేదు.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురి కావడానికి ముందు అలా అలా హిట్ -యావరేజ్ ల దోబూచులాటలో వుంటూ వచ్చారు. ప్రమాదం తరువాత చేసిన విరూపాక్ష పెద్ద హిట్. మామయ్య పవన్ కాంబినేషన్ లో చేసిన బ్రో యావరేజ్ గా మిగిలిపోయింది. ఆ తరువాత మరి సినిమా ఏదీ స్టార్ట్ కాలేదు. సంపత్ నంది సినిమా అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది. డిసెంబర్ నుంచా? జనవరి నుంచా? అన్నది తేలాల్సి వుంది. 2024 సమ్మర్ కు కానీ సినిమా థియేటర్ కు వచ్చే అవకాశం అయితే లేదు.

వైష్ణవ్ తేజ్ గ్రాఫ్ మరీ చిత్రం. తొలి చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్. ఆ తరువాత రెండు ఫ్లాపులు వరుసగా పలకరించాయి. ఏడాది అవుతోంది సినిమా థియేటర్ లోకి వచ్చి. ప్రస్తుతం ఫినిష్ చేసిన ఆదికేశవ ఈ నెలలో థియేటర్ లోకి వస్తోంది. సెట్ మీద ఏ సినిమా లేదు. ఆదికేశవ హిట్ అయితే సినిమాలు లైన్ లో పడతాయి. లేదంటే మాత్రం కాస్త కష్టమే.

ప్రస్తుతం వున్న లైనప్ చూస్తుంటే మాత్రం మెగా థర్డ్ జనరేషన్ సెకెండ్ జనరేషన్ రేంజ్ కు చేరడానికి ఇంకా చాలా టైమ్ పట్టేలా వుంది.