రాబోయే ఎన్నికల కోసం పవన్ తన రథాన్ని రెడీ చేయించేసారు. మిలటరీ ట్రక్ మాదిరిగా ఓ వాహనాన్ని రెడీ చేయించుకుంటున్నారని ముందుగానే వార్తలు వచ్చాయి.
అచ్చంగా ఇప్పుడు అలాంటి వాహనం ఫొటోలనే పవన్ షేర్ చేసారు. ఫొటోలు షేర్ చేయడం సంగతి సరే, ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో మాత్రం మరీ ఓవర్ యాక్షన్ మాదిరిగా వుంది. ఈ రథానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. యుద్దానికి వారాహి సిద్దం అనే టైటిల్ లో వీడియో వదిలారు.
కావాలని తన బాడీ గార్డ్ లను మిలటరీ జవాన్లు మాదిరిగా చూపించి, మిలటరీ ట్రక్, దానికి ఇరు వైపులా సైనికుల మాదిరిగా గార్డులు కవాతు చేస్తున్నట్లు ఓ వీడియో తయారు చేసి వదిలారు. పైగా మిలటరీ కలరింగ్ రావడానికి ఇవి మాత్రం సరిపోవు అని సెక్యూరిటీ గార్డ్ లకు పంజాబీల మాదిరిగా గెటప్ లు వేసారు. సాధారణంగా మిలటరీలో సిక్కు సిపాయిలు ఎక్కువ వుండడం అన్నది జనానికి గుర్తు కదా.
అలా మొత్తం మీద ఓ మిలటరీ కవాతు..పవన్ కళ్యాణ్ యుద్దానికి వెళ్తున్న ‘సినిమా’ కలరింగ్ ఇచ్చారు. మొత్తానికి పవన్ కు చాలా ఫాంటసీలు వున్నాయి. తుపాకులు. మిలటరీ. నక్సల్ యూనిఫారమ్..ఇలా చాలా ఫాంటసీలు వున్నాయి. అవన్నీ ఇలా తీర్చుకుంటూ వుంటారు. మొత్తానికి వారాహి రెడీ. గార్డులు రెడీ. కానీ వరుస సినిమాలు ఒప్పుకుంటున్న పవన్ మాత్రం రెడీనో? కాదొ?